Heeramandi OTT: ఆరుగురు హీరోయిన్లతో హీరామండి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఏం చేసినా లావిష్‌గా చేస్తాడు. 'దేవదాస్', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్', 'గంగూబాయి కతియావాడి' వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారాయన. అలాంటి సంచలన దర్శకుడు ఇప్పుడు OTT ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'హీరమండి' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

Heeramandi OTT: ఆరుగురు హీరోయిన్లతో హీరామండి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Heeramandi Web Series
Follow us
Basha Shek

|

Updated on: Apr 11, 2024 | 8:10 AM

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఏం చేసినా లావిష్‌గా చేస్తాడు. ‘దేవదాస్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారాయన. అలాంటి సంచలన దర్శకుడు ఇప్పుడు OTT ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘హీరమండి’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న , అలియా భట్ వంటి ప్రముఖులు ఈ ట్రైలర్ ను మెచ్చుకోవడం విశేషం. సంజయ్ లీలా బన్సాలీ ‘హీరమండి’ వెబ్ సిరీస్‌ని ఎంతో ల్యావిష్ గా తీశారనడానికి ఈ ట్రైలర్ నిదర్శనం. స్వాతంత్యానికి పూర్వం నాటి పాకిస్తాన్‌లో లాహోర్‌లోని వేశ్య గృహాల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ హయాంలో వేశ్యల జీవితాలు ఎలా ఉంటుందో హీరా మండి ట్రైలర్‌లో పరిచయం చేశారు. ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది నటీమణులు ప్రధాన పాత్రలు పోషించారు. హీరామండి సిరీస్ మే 1న ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.

మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ తదితరులు ‘హీరమండి’ వెబ్ సిరీస్‌లో నటించారు. లావిష్ సెట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ అన్నీ అందరినీ ఆకర్షిస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ అభిమానులు ఈ వెబ్ సిరీస్‌ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘హీరమండి’ ట్రైలర్ చూసిన అలియా భట్ మ్యాజికల్ అని మెచ్చుకుంది. గతంలో సంజయ్ లీలా బన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’లో ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించింది. ఆ సినిమాలో తన నటనకు గాను ఆమెకు ‘ఉత్తమ నటి’గా జాతీయ అవార్డు లభించింది. విక్కీ కౌశల్‌కి కూడా ‘హీరమంది’ ట్రైలర్‌ బాగా నచ్చింది. ‘ఇది అద్భుతం. గొప్ప కళాఖండం’ అని ఆయన సూచించారు. ఈ వెబ్ సిరీస్‌లోని మహిళా ఆర్టిస్టుల ప్రతిభను నటి రష్మిక మందన్న ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

హీరామండి వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.