T20 World Cup 2024: కోహ్లీ ఫ్యాన్స్‌ కాలర్ ఎగరేసుకునే న్యూస్.. టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో విరాట్‌కు స్థానం పక్కా

విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ సీజన్ 17లో టాప్ స్కోరర్‌గా వెలుగొందుతున్న టీమిండియా రన్ మెషిన్‌కి రానున్న టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం ఖాయమని తెలుస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీని ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం

T20 World Cup 2024: కోహ్లీ ఫ్యాన్స్‌ కాలర్ ఎగరేసుకునే న్యూస్.. టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో విరాట్‌కు స్థానం పక్కా
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Apr 09, 2024 | 8:41 PM

విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ సీజన్ 17లో టాప్ స్కోరర్‌గా వెలుగొందుతున్న టీమిండియా రన్ మెషిన్‌కి రానున్న టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం ఖాయమని తెలుస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీని ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలగేందుకు విరాట్‌ కోహ్లీని ఒప్పించాలని సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌కు బీసీసీఐ కార్యదర్శి జే షా సూచించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ బాధ్యత నుంచి అగార్కర్ వెనక్కి తగ్గారు. దీని తర్వా త, జై షా రోహిత్ శర్మతో ఈ విషయాన్ని లేవనెత్తినట్లు మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ వెల్లడించాడు. అయితే కోహ్లీ టీ20 ప్రపంచకప్ జట్టులో కచ్చితంగా ఉండాలని రోహిత్ శర్మ బీసీసీఐకు గట్టిగా చెప్పినట్లు కీర్తి ఆజాద్ తెలిపారు. దీంతో ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావించింది. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు ఐపీఎల్ లో 5 మ్యాచ్‌ల్లో 316 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.  తద్వారా ఈ సీజన్‌ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ రాణిస్తే ఇక టీ 20 ప్రపంచకప్ లో కోహ్లీ స్థానానికి ఢోకా లేదని తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్‌కు విరాట్ కోహ్లీని ఎంపిక చేయాల్సిన అవసరం బీసీసీఐకి ఎదురైంది. ఎందుకంటే సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీని ఏ కారణం చేతనైనా జట్టు నుంచి తప్పించలేం. అందువల్ల అతడు టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కావడం ఖాయమని బీసీసీఐ వర్గాలు తెలిపాయని క్రిక్‌బజ్ నివేదించింది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే భారత జట్టులో విరాట్ కోహ్లీ కనిపిస్తాడని చెప్పొచ్చు. అలాగే కింగ్ కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచకప్. మరి కోహ్లీ ప్రపంచకప్ గెలుస్తాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్‌లో పాల్గొనే టీమ్ ఇండియా ఆటగాళ్ల పేర్లు (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..