PBKS vs SRH, IPL 2024: అదరగొట్టిన తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు

Punjab Kings vs Sunrisers Hyderabad: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిక్ క్లాసెన్.. ఇలా మహామహులైన బ్యాటర్లు చేతులెత్తేసిన చోట తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి అదరగొట్టాడు. తన మెరుపు ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ కు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు.

PBKS vs SRH, IPL 2024: అదరగొట్టిన తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు
Sunrisers Hyderabad
Follow us
Basha Shek

|

Updated on: Apr 09, 2024 | 11:27 PM

Punjab Kings vs Sunrisers Hyderabad: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిక్ క్లాసెన్.. ఇలా మహామహులైన బ్యాటర్లు చేతులెత్తేసిన చోట తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి అదరగొట్టాడు. తన మెరుపు ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ కు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు. మంగళవారం (ఏప్రిల్ 09) తో పంజాబ్ కింగ్స్ తో ముల్లాన్‌పుర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్‌ రెడ్డి (37 బంతుల్లో 64, 4 ఫోర్లు, 5 సిక్సర్లు ) అర్ధశతకంతో రాణించాడు. ట్రావిస్ హెడ్‌ (21), అభిషేక్‌ (16), సమద్‌ (25) ఫర్వాలేదనిపించారు. ఐడెన్ మార్‌క్రమ్‌ (0), హెన్రిచ్ క్లాసెన్‌ (9), రాహుల్ త్రిపాఠి (11) పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. అయితే చివర్లో షాబాజ్‌ అహ్మద్ (14*) కాస్త దూకుడుగా ఆడటంతో హైదరాబాద్‌ కు గౌరవ ప్రదమైన స్కోరే వచ్చింది. పంజాబ్‌ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షల్‌ 2, శామ్‌ కరన్‌, రబాడా చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఎస్ ఆర్ హెచ్ కు శుభారంభం లభించ లేదు. 27 పరుగుల వద్ద సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్ 21 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మార్క్రామ్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. అర్ష్దీప్ సింగ్ అతనికి పెవిలియన్ దారి చూపించాడు. ఆ తర్వాత 16 పరుగుల వద్ద అభిషేక్ శర్మ కూడా ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి

అయితే నితీష్ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. రాహుల్ త్రిపాఠి 11, హెన్రిక్ క్లాసెన్ 9, అబ్దుల్ సమద్ 25 పరుగులు చేసి ఔటయ్యారు. పంజాబ్‌ తరఫున అర్ష్‌దీప్‌ సింగ్‌ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 2 వికెట్లు, సామ్ కరణ్ 4 ఓవర్లలో  41 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. కగిసో రబాడ 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

రెండు జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభాసిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐదాన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..