- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: List Of Top 5 Players Who Won Most Player Of The Match In IPL History
IPL 2024:ఎక్కువగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెల్చుకున్న టాప్-5 ప్లేయర్లు వీరే.. టీమిండియా నుంచి ఎవరంటే?
IPL టోర్నమెంట్ 2008 నుండి ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 16 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 17వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. మరి ఈ 16 సీజన్లలో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను ఎవరు గెల్చుకున్నారో తెలుసుకుందాం రండి.
Updated on: Apr 10, 2024 | 8:24 AM

మిస్టర్ 360గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 25 సార్లు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును AB అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ, ఢిల్లీ తరఫున ఏబీ ఆడాడు.

'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ 22 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. గేల్ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, కేకేఆర్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

ఈ జాబితాలో ముంబై బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ 19 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఆడే ముందు డెక్కన్ ఛార్జర్స్ తరఫున కూడా ఆడాడు.

డేవిడ్ వార్నర్ 18 సార్లు ఐపీఎల్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. వార్నర్ ఐపీఎల్‌లో ఢిల్లీ, హైదరాబాద్‌ల తరఫున ఆడాడు

ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ ఐదో స్థానంలో ఉన్నాడు. ధోనీ 17 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. ధోనీ చెన్నై, పుణె జట్ల తరఫున ఆడాడు.




