AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ మేనేజర్ జీతం ఎంతో తెలుసా? స్టార్ హీరోలకు తగ్గని రేంజ్‌లో సంపాదన

ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా ఇటీవల వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వైజాగ్ కువచ్చాడు. డా..వైఎస్. రాజశేఖర్ రెడ్డి స్టేడియం గ్యాలరీలో కూర్చొని తన జట్టును ఎంకరేజ్ చేశారు. అయితే ఈ సమయంలో షారుఖ్ వెంట ఒక మహిళ కూడా కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ మేనేజర్ జీతం ఎంతో తెలుసా? స్టార్ హీరోలకు తగ్గని రేంజ్‌లో సంపాదన
Shah Rukh Khan, Pooja Dadlani
Basha Shek
|

Updated on: Apr 08, 2024 | 7:59 PM

Share

ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా ఇటీవల వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వైజాగ్ కువచ్చాడు. డా..వైఎస్. రాజశేఖర్ రెడ్డి స్టేడియం గ్యాలరీలో కూర్చొని తన జట్టును ఎంకరేజ్ చేశారు. అయితే ఈ సమయంలో షారుఖ్ వెంట ఒక మహిళ కూడా కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. దీంతో ఆమె ఎవరు అని చాలా మందికి ఆశ్చర్యమేసింది. ఇంతకీ ఆమెవరో తెలుసా? బాలీవుడ్ బాద్ షా మేనేజర్ పూజా దద్లానీ. షారుఖ్ వ్యవహారాలన్నీ ఆమె చూసుకుంటారు. తన జీతం గురించి కూడా సామాజిక మాధ్యమాల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా అపజయాలు ఎదుర్కొంటోన్న షారుఖ్ ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ప్రారంభించిన దుస్తుల వ్యాపారం బాగానే సాగుతోంది. సుహానా ఖాన్ సినిమా కూడా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ వ్యవహారాలన్నింటినీ మేనేజర్ పూజ నే చూసుకుంటుంది.

షారూఖ్‌ ఖాన్‌కు వేలాది కోట్ల ఆస్తులున్నాయి. అతను పూజా దద్లానీని చాలా నమ్ముతాడు. అందుకే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలన్నింటినీ తన మేనేజర్ కే అప్పగించాడు. పూజ కేవలం షారుఖ్ మేనేజర్‌గా పనిచేయడం లేదు. ఆయన కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారు. ఆర్యన్ ఖాన్ 2021లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో షారుక్ చాలా ఇబ్బందుల్లో పడ్డాడు. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం పూజ చాలా ప్రయత్నించింది. పలు సందర్భాల్లో షారూఖ్‌కు బదులుగా పూజా దద్లానీ నే కోర్టు ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. షారూఖ్ ఖాన్ చాలా బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్. ఈ సంస్థలకు సంబంధిచంచిన యాడ్ షూటింగ్ మొదలైన వాటికి పూజనే డేట్స్ ఏర్పాటు చేస్తుంటుంది. షారూఖ్ ఖాన్ హోస్ట్ చేసే అన్ని పార్టీలకు పూజా హాజరవుతుంది. ఇక పూజ వేతనం విషయానికి వస్తే.. ఏటా సుమారు 7-9 కోట్ల రూపాయలు అందుకుంటుందట. ఇప్పటికే ఆమెకు సుమారు రూ.45 కోట్లకు పైగా ఆస్తులున్నాయని సమాచారం .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి