Sanjay Dutt: లోక్‌సభ ఎన్నికల బరిలో సంజయ్ దత్.. ఆ మాజీ సీఎం పై పోటీ.. క్లారిటీ ఇదిగో

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి . అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సినీ ప్రముఖులను కూడా రంగంలోకి దింపుతున్నాయి. రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ వంటి ప్రముఖ నటీనటులు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు

Sanjay Dutt: లోక్‌సభ ఎన్నికల బరిలో సంజయ్ దత్.. ఆ మాజీ సీఎం పై పోటీ.. క్లారిటీ ఇదిగో
Sanjay Dutt
Follow us
Basha Shek

|

Updated on: Apr 09, 2024 | 7:46 AM

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి . అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సినీ ప్రముఖులను కూడా రంగంలోకి దింపుతున్నాయి. రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ వంటి ప్రముఖ నటీనటులు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు . ఇదే తరుణంలో బాలీవుడ్‌కి చెందిన మరో స్టార్‌ నటుడు సంజయ్‌దత్‌ రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంజయ్‌దత్‌ హర్యానాలోని కర్నాల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ బలమైన నేత, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు పోటీగా సంజయ్‌ దత్‌ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై సంజయ్ దత్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘నేను రాజకీయాల్లోకి వస్తానని వస్తున్న పుకార్లకు స్వస్తి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ పార్టీకి చెందను లేదా ఎన్నికల్లో పోటీ చేయను. నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే ముందుగా నేనే ప్రకటిస్తాను. ప్రస్తుతానికి నాపై వస్తున్న వార్తలను నమ్మడం మానుకోవాలి’ అని సంజయ్ దత్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పష్టం చేశారు. ఇంతకు ముందు కూడా సంజయ్ దత్ పై ఇలాంటి రూమర్స్ వచ్చాయి. 2019లో ‘రాష్ట్రీయ సమాజ్ పక్ష’లో చేరాలని ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కానీ అది నిజం కాలేదు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సంజయ్ దత్ పై మరోసారి పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనే స్వయంగా క్లారిటీ ఇస్తూ అన్నిరూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

సంజయ్ దత్ కు దేశ వ్యాప్తంగా పేరుంది. ఇంతకుముందు బాలీవుడ్‌లో మాత్రమే ఫేమస్ అయిన అతను ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా సత్తా చాటుతున్నాడు. యష్ నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’లో సంజయ్ దత్ పోషించిన అధీర పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత విజయ్ దళపతి లియోలోనూ విలన్ గా మెరిశాడు. ఇప్పుడు మరిన్ని సౌత్ ఇండియా ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

సంజయ్ దత్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి