మహేష్ బాబు కోసం విలన్‌గా మారనున్న మిస్టర్ ఫర్ఫెక్ట్.. అమీర్ తో రాజమౌళి భేటీ?
లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ తర్వాత అమీర్ ఖాన్ మరే సినిమాలోనూ నటించడం లేదు. ఆయన ఇంకా ఏ సినిమాకు సైన్ చేయలేదు. అయితే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రంలో అమీర్ ఖాన్ భాగం కావచ్చని వార్తలు వస్తున్నాయి. నిజానికి రాజమౌళి, మహేష్ బాబుల తదుపరి సినిమాలో అమీర్ విలన్‌గా నటించే అవకాశం ఉందని చాలా కాలంగా ఓ వార్త వినిపిస్తూనే ఉంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకూ ఫిల్మ్ మేకర్స్ కానీ, అమీర్ ఖాన్ కానీ స్పందించలేదు
దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళ కాంబోలో తెరకెక్కనుంది. SSMB29 అనే పేరుతో ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కూడా నటించవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. 1000 కోట్లతో రూపొందుతున్న రాజమౌళి ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆయనను సంప్రదించినట్లు ఒక టాక్. అంతేకాకుండా దీనికి సంబంధించి రహస్య సమావేశం కూడా జరిగిందనే పుకారు షికారు చేస్తోంది.
లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ తర్వాత అమీర్ ఖాన్ మరే సినిమాలోనూ నటించడం లేదు. ఆయన ఇంకా ఏ సినిమాకు సైన్ చేయలేదు. అయితే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రంలో అమీర్ ఖాన్ భాగం కావచ్చని వార్తలు వస్తున్నాయి. నిజానికి రాజమౌళి, మహేష్ బాబుల తదుపరి సినిమాలో అమీర్ విలన్‌గా నటించే అవకాశం ఉందని చాలా కాలంగా ఓ వార్త వినిపిస్తూనే ఉంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకూ ఫిల్మ్ మేకర్స్ కానీ, అమీర్ ఖాన్ కానీ స్పందించలేదు. దీంతో ఇది పుకారు అని చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ లో మళ్లీ అలాంటి చర్చ ముమ్మరంగా జరుగుతోంది.
ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం బాహుబలి ఫేమ్ దర్శకుడు రాజమౌళి, అమీర్ ఖాన్ కొద్ది రోజుల క్రితం ముంబైలో రహస్యంగా కలుసుకున్నారు. వీరిద్దరి రహస్య భేటీ తర్వాత రాజమౌళి, మహేష్ బాబుల SSMB29 కోసమే ఈ భేటీ అని మరోసారి గాసిప్స్ హాల్ చల్ చేస్తున్నాయి. అయితే అధికారికంగా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
SSMB29 లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రాజమౌళి అమీర్ ఖాన్‌ని సంప్రదించినట్లు నివేదికలలో చెప్పబడింది. ఈ వార్త నిజమై అమీర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే.. అభిమానులకు మరో భారీ చిత్రం కనుల విందు చేయనుంది. విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని దేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా అభివర్ణిస్తున్నారు. దీని బడ్జెట్ దాదాపు 1000 కోట్ల రూపాయలు.
దక్షణాది, బాలీవుడ్ నటుల కలయిక
రాజమౌళి సినిమాలో అమీర్ పార్ట్ అవుతాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే గత కొంతకాలంగా సినిమా పరిశ్రమ ఉత్తరాది దక్షినాది అనే ఎల్లలు చేరిపెస్తోంది. ఇటీవల కాలంలో సౌత్ నుంచి బాలీవుడ్ కి, బాలీవుడ్ నుంచి దక్షిణ బాషా సినిమాల్లో నటిస్తున్న స్టార్ నటీనటులు చాలా మంది ఉన్నారు. హృతిక్ రోషన్ వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ , కియారా అద్వానీ కూడా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి పనిచేస్తున్నారు. గతంలో కూడా బాలీవుడ్ నటీనటులు దక్షిణాది సినిమాల్లో ఎక్కువగానే నటించారు. ప్రస్తుతం ఈ జాబితా రోజురోజుకు పెద్దదవుతోంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..