Ugadi 2024: ఉగాది పండగను దేశ, విదేశాల్లో ఏఏ ప్రాంతాల్లో ఏయే పేర్లతో జరుపుకుంటారో తెలుసా..
ఉగాది తెలుగు సంవత్సారాది.. కొత్త సంవత్సరానికి.. కొత్త భవిష్యత్తుకు స్వాగతం పలుకుతూ వైభవంగా జరుపుకునే ఈ పండగను తెలుగు వారు ఉగాది పండగగా జరుపుకుంటే... దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. ఈరోజు ఉగాదిని దేశంలో ఏయే ప్రాంతాల్లో ఏయే పేర్లతో జరుపుకుంటారో తెలుసుకుందాం.. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పంజాబ్, బెంగాల్ ప్రాంతాల్లో ఉగాదిని వివిధ పేర్లతో జరుపుకుంటారు. అయితే పేర్లు వేరుగా ఉన్నా అన్ని ప్రాంతాల్లో ఉగాదిని జరుపుకునేది దాదాపు ఒకే విధంగా ఉంటుంది.. అందరూ తమ బంగారు భవిష్యత్తే కోసమే అని చెప్పవచ్చు.
ఉగాది పండగతో తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ రోజున తయారు చేసే వేప పువ్వు పచ్చడి జీవిత పరమార్ధాన్ని తెలియజేస్తుంది. జీవితంలో సుఖ దుఃఖాలు, సంతోష విషాదాలు ఇవన్నీ జీవితంలో సహజమని.. వీటిని నేర్పుగా దాటుకుంటూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని.. చూపించేది ఉగాది పచ్చడి. షడ్రుచులు ఉండే ఈ పచ్చడి ఒకొక్క రుచి ఒకొక్క జీవిత సత్యాన్ని, ఒక్కొక్క పదార్ధాన్ని తెలిజేస్తుంది. ఉగాది తెలుగు సంవత్సారాది.. కొత్త సంవత్సరానికి.. కొత్త భవిష్యత్తుకు స్వాగతం పలుకుతూ వైభవంగా జరుపుకునే ఈ పండగను తెలుగు వారు ఉగాది పండగగా జరుపుకుంటే… దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. ఈరోజు ఉగాదిని దేశంలో ఏయే ప్రాంతాల్లో ఏయే పేర్లతో జరుపుకుంటారో తెలుసుకుందాం..
- మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పంజాబ్, బెంగాల్ ప్రాంతాల్లో ఉగాదిని వివిధ పేర్లతో జరుపుకుంటారు. అయితే పేర్లు వేరుగా ఉన్నా అన్ని ప్రాంతాల్లో ఉగాదిని జరుపుకునేది దాదాపు ఒకే విధంగా ఉంటుంది.. అందరూ తమ బంగారు భవిష్యత్తే కోసమే అని చెప్పవచ్చు.
- మహారాష్ట్రలో ఉగాది పర్వదినాన్ని గుడి పడ్వాగా జరుపుకుంటారు. మరాఠీలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి పండగలు, పర్వదినాలు, శుభకార్యాలను జరుకుంటారు. అందుకనే గుడి పడ్వా పండుగను కన్నడిగులు చైత్ర శుద్ద పాడ్యమి రోజున మరాఠీలు సంప్రదాయంగా జరుపుకుంటారు. పడ్వా అంటే పాడ్యమి అని అర్థం. మరాఠీలు కూడా ఉగాది పచ్చడి వంటిది తయారు చేస్తారు. అంతేకాదు బ్రహ్మా దేవుడు సృష్టి ప్రారంభించిన రోజుకి గుర్తుగా బ్రహ్మధ్వజం ఏర్పాటు చేస్తారు. దానికి వెదురుపుల్లకు పట్టువస్త్రం కప్పుతారు. అనంతరం పువ్వులతో బ్రహ్మ ధ్వజాన్ని ఆలకరించిన పైన వెండి లేదా కంచుపాత్రను బోర్లిస్తారు. మరాఠీలు గుడిపడ్వా రోజున తప్పనిసరిగా బ్రహ్మధ్వజాలను ప్రతిష్టిస్తారు.
- బెంగాలీలకు కొత్త సంవత్సరం వైశాఖమాసం నుంచి ప్రారంభమవుతుంది. బెంగాలీ కాలమానం ప్రకారం చైత్ర మాసం ఏడాదిలో చివరిమాసం. కనుక వైశాఖ శుద్ధ పాడ్యమి రోజుని ఉగాది పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజుని పోయ్ లా బైశాఖ్ అంటారు.
- ఒకప్పుడు తమిళనాడులోనూ, తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టుగానే ఒకే సమయంలో పండగలు జరుపుకునేవారు. ఉగాదిని తమిళనాడులో కొత్త సంవత్సరం వేడుకలను పుత్తాండుగా పిలుస్తారు. అయితే ఉగాదిని చిత్తిరై తిరునాళ్ గా ఇప్పుడు జరుపుకుంటున్నారు.
- సిక్కులు సౌరమానాన్ని పాటిస్తారు. కాబట్టి దీని ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి వారి సంవత్సరాది. ఇది ప్రతిఏటా ఎప్రిల్ 13న వస్తుంది. మళయాళంలో విషు అంటారు. వీరు కూడా సౌరమానాన్నే అనుసరిస్తారు. అందుకే వీరి ఉగాది కూడా ఏప్రిల్ నెలలోనే వస్తుంది.
- సింధీలు తమ క్యాలెండర్ ప్రారంభమైన రోజుని చేతి చంద్‌ను ఉగాదిగా సెలబ్రేట్ జరుపుకుంటారు.
- మణిపురిలు కూడా తమ కొత్త సంవత్సరంన సాజిబు నోంగ్మా పన్బామాగా జరుపుకుంటారు. ఉగాది రోజు ఉదయం అభ్యంగనస్నానంతో ప్రారంభం అవుతుంది. సాయంత్రం ఆలయంలో పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణంతో ఏడాది మొత్తం ఎలా ఉండనుందో తెలుసుకుంటారు. ఏ పండుగలకి లేని స్పెషాలిటీ ఉగాదికే పంచాంగ శ్రవణం.
- మన దేశంలోనే కాదు బాలి దేశంలోని హిందువులు కొత్త ఏడాదిని నైపి రోజునే జరుపుకుంటారు.
- మారిషస్‌లోని ఐదు హిందూ జాతీయ ప్రభుత్వ సెలవు దినాల్లో ఉగాది పర్వదినం ఒకటి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..