AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీగిరి క్షేత్రంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు.. వీరచర్య విన్యాసాలు, అగ్నిగుండంలో నడిచిన కన్నడ భక్తులు

ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీశైలంలో ఒళ్లు గగ్గుర్లు పొడిసేలా వీరశైవుల విన్యాసాలు చోటు చేసుకున్నాయి. తమ శరీర భాగాలలో శూలాలతో గుచ్చుకుని భక్తిని చాటుకున్నారు కన్నడిగులు. శివదీక్ష శిభిరాలలో అగ్నిగుండంలో హర హర మహాదేవ అంటూ కన్నడ భక్తులు నడిచారు. వీరశైవుల విన్యాసాలు తిలకించిన లక్షలాదిమంది భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Srisailam: శ్రీగిరి క్షేత్రంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు.. వీరచర్య విన్యాసాలు, అగ్నిగుండంలో నడిచిన కన్నడ భక్తులు
Ugadi Celebrations
Surya Kala
|

Updated on: Apr 09, 2024 | 6:39 AM

Share

నంద్యాల జిల్లాలోని ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. అపరభక్తికి మూలం వీరశైవుల విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం ఒళ్లు గగ్గుర్ పొడిచేలా అర్ధరాత్రి వరకు శ్రీశైలంలో సాగాయి వీరాచార విన్యాసాలు. వీరశైవుల శరీరాలపై ఇనుప సువ్వలతో గుచ్చుకుని తమ భక్తిని చాటుకున్నారు. వీరశైవుల విన్యాసాలు తిలకించిన లక్షలాది మంది భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాక్ష్యాత్తు ఆ పరమశివుని సన్నిధీలోని శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సందర్భంగా కన్నడ భక్తులు వారి శరీర భాగాలపై ఇనుప సువ్వలతో గుచ్చుకుని వారి భక్తి ప్రపత్తిని చాటుకున్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఉగాది పర్వదినానికి ముందు రోజు రాత్రి వీరశైవుల అగ్నిగుండ ప్రవేశం. ఉగాది ఉత్సవాల్లో ప్రధానమైన ఘట్టం తమ ఆడపడుచుగా ఆరాదించే భ్రమరాంబికాదేవి సన్నిదిలో కన్నడిగులు సర్వపాపాలు హరించాలన్న సంకల్పంతో మంగళవారం అమావాస్యనాడు రాత్రి అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఎంతో ఆద్యాత్మక భరితంగా సాగిన ఈ కార్యక్రమములో ముందుగా అగ్ని గుండానికి ఆలయ అర్చకులు, ఈవో పెద్దిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వీరశైవులు తమవిన్యాసాలు ప్రదర్శించారు.

రాత్రి 11 గంటలకు శివదీక్షాశిభిరాలలో శరీర భాగాల్లో, నోటిలో బుగ్గలలో ఇనుప సువ్వలని గుచ్చుకుంటూ హరహర మహాదేవా అంటూ ఆ మల్లికార్జునస్వామికి వేడుకుకున్నారు. నుదిటిపై కనుబొమ్మలపై చేతులసై గుచ్చుకుంటు ఒళ్లు గగ్గుర్లు పొడిచే ఇనుప సువ్వలను కన్నడిగుల తమ శరీరభాగాలలో గుచ్చుకుని భక్తి తన్మయంతో చేసిన నృత్యాలు ఆద్యత్మిక ఆకర్శనగా నిలిచాయి. పూర్వం మల్లికార్జునస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు వీరశైవులు తమ శరీరభాగాలను అర్పించేవారని అందుకే శ్రీస్వామివారి గర్భాలయం ఎదురుగా వీర శిరోమండపాన్ని అప్పటి రాజులు నిర్మంచినట్లుగా చరిత్ర చెబుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమములోనే నేటికి ఉగాది పర్వదినానికి ముందు రోజు అమావాస్యనాడు రాత్రి వీరాచార్య విన్యాసం అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు శ్రీశైలం క్షేత్రంలో సాంప్రదాయ బద్దంగా జరుగుతున్నాయి. అనంతరం వీరశైవ భక్తబృందాలు వీరాచార విన్యసాలతో అగ్నిగుండంలో నడుచుకుంటూ వారి మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసులు అర్చకులు, సిబ్బంది పెద్దఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..