Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2024: ఉగాది రోజున ఈ పనులు చేస్తే.. ఏడాదంతా మీకు శుభమే!

తెలుగువారి సంవత్సరాది ఉగాది పండుగ. ప్రతీ ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీ అంటే మంగళవారం వచ్చింది. ఉగాది పండుగకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది అంటే.. ప్రకృతి.. పచ్చదనం. అయితే కొత్త సంవత్సరాది ఉగాది పండుగ రోజు చాలా మంది తెలిసీ తెలియక చిన్న చిన్న తప్పులు..

Ugadi 2024: ఉగాది రోజున ఈ పనులు చేస్తే.. ఏడాదంతా మీకు శుభమే!
Ugadi 2024
Follow us
Chinni Enni

| Edited By: TV9 Telugu

Updated on: Apr 08, 2024 | 7:27 PM

తెలుగువారి సంవత్సరాది ఉగాది పండుగ. ప్రతీ ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీ అంటే మంగళవారం వచ్చింది. ఉగాది పండుగకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది అంటే.. ప్రకృతి.. పచ్చదనం. అయితే కొత్త సంవత్సరాది ఉగాది పండుగ రోజు చాలా మంది తెలిసీ తెలియక చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఉగాది రోజు ఖచ్చితంగా కొన్ని రకాల పనులు చేయాలట. దీని వల్ల ఏడాదంతా శుభంగా ఉంటుందని పెద్దలు, పురాణాలు చెబుతాయి. అలాగే చేయకూడని పనులేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగాది రోజు చేయాల్సిన పనులు:

1. ఉగాది రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి.. కొత్త బట్టలు ధరించాలి.

2. ఉగాది పండుగ రోజు మీకు ఇష్టమైన కులదైవాలను పూజించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి.

ఇవి కూడా చదవండి

3. అదే విధంగా ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రతీ ఒక్కరు ఉగాది పచ్చడిని తినాలి. దైవ దర్శనం చేసుకోవాలి. ఆలయాలకు వెళ్లాలి.

4. ఉగాది పచ్చడి నవగ్రహాలతో పోలుస్తూ ఉంటారు. నవగ్రహాలలోని కొన్ని గ్రహాలకు ఈ పచ్చడిలోని రుచులతో సంబంధం ఉందని చెబుతారు.

5. ఖచ్చితంగా సాయంత్రం పూట పంచాంగం శ్రవణం చేయాలి. ఇలా చేస్తే ఏడాదంతా మంచే జరుగుతుంది.

6. లేని వారికి అన్నదానం, వస్త్రదానం, వస్తువులు దానాలు చేస్తూ ఉండాలి.

ఉగాది రోజు చేయకూడని పనులు:

1. పొద్దు పోయేంత వరకు నిద్రపోకూడదు.

2. ఎవర్నీ దూషించి మాట్లాడకూడదు.

3. గొడవలకు దూరంగా ఉండాలి.

4. చిరిగిపోయిన లేదా మాసిపోయిన బట్టలను ధరించకూడదు.

5. ఈ రోజు ఏడుస్తూ ఉండకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..