IPL 2024: 0,3,28,0,1.. 5 మ్యాచుల్లో 32 రన్స్.. ఆర్సీబీని నిండా ముంచేస్తోన్న 14 కోట్ల ప్లేయర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్-17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. అమ్మాయిల తరహాలోనే ఈ సారి ఐపీఎల్ కప్ కొడదామన్న బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోయింది. కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.

IPL 2024: 0,3,28,0,1.. 5 మ్యాచుల్లో 32 రన్స్.. ఆర్సీబీని నిండా ముంచేస్తోన్న 14 కోట్ల ప్లేయర్
RCB Team
Follow us

|

Updated on: Apr 08, 2024 | 8:39 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్-17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. అమ్మాయిల తరహాలోనే ఈ సారి ఐపీఎల్ కప్ కొడదామన్న బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోయింది. కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆర్సీబీ జట్టు ఓటమికి స్టార్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శనే ప్రధాన కారణం. ముఖ్యంగా ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఫ్లాప్ షో RCBకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే గత ఐదు మ్యాచ్‌ల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 32 పరుగులే చేశాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సున్నాకి అవుటైన మ్యాక్సీ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులు చేసినా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ డకౌట్ అయ్యాడు . ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు.

అంటే తొలి ఐదు మ్యాచ్‌ల్లో మ్యాక్స్‌వెల్ రెండుసార్లు సున్నాకి ఔటయ్యాడు. మళ్లీ రెండుసార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వికెట్ సమర్పించుకున్నాడు. అంటే ఇప్పటి వరకు కేవలం 6.40 సగటుతో పరుగులు సాధించాడీ స్టార్ ఆల్ రౌండర్. గ్లెన్ మాక్స్‌వెల్ ఫ్లాప్ షో RCB జట్టు కు ప్రతికూలంగా మారింది. ఇదే గ్లెన్ మ్యాక్స్‌వెల్ గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 400 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి మ్యాక్స్‌వెల్ తొలి ఐదు మ్యాచ్‌ల్లో కనీసం 50 పరుగులు కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయేష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్ కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, ., మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?
కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా? ఓడిపోతారా? ఆ అంశమే కీలకం..!
కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా? ఓడిపోతారా? ఆ అంశమే కీలకం..!
సీరియల్ నటికీ చుక్కలు చూపించిన పోలీసులు..
సీరియల్ నటికీ చుక్కలు చూపించిన పోలీసులు..
ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే అరకిలో గోల్డ్ మాయం.. సీన్ కట్ చేస్తే.!
ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే అరకిలో గోల్డ్ మాయం.. సీన్ కట్ చేస్తే.!
చెన్నై, బెంగళూరు జట్లలో ప్లే ఆఫ్ చేరేది ఎవరు?
చెన్నై, బెంగళూరు జట్లలో ప్లే ఆఫ్ చేరేది ఎవరు?
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్‌‎లేటర్ తొక్కిన డాక్టర్.. కట్ చేస్తే..
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్‌‎లేటర్ తొక్కిన డాక్టర్.. కట్ చేస్తే..