CSK vs KKR, IPL 2024: కోల్‌కతాను కట్టడి చేసిన చెన్నై బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెలరేగారు. సోమవారం (ఏప్రిల్ 08) చెపాక్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లను కట్డడి చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు

CSK vs KKR, IPL 2024: కోల్‌కతాను కట్టడి చేసిన చెన్నై బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?
Csk Vs Kkr Match
Follow us

|

Updated on: Apr 08, 2024 | 10:32 PM

సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెలరేగారు. సోమవారం (ఏప్రిల్ 08) చెపాక్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లను కట్డడి చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఆరంభం నుంచే కోల్ కతా బ్యాటర్లపై దాడికి దిగారు సీఎస్కే బౌలర్లు. పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేయడంతో కోల్ కతా బ్యాటర్లు పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డారు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సునీల్ నరైన్ (27), రఘువంశీ (24) పరుగులు చేశారు.

కోల్‌కతాలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 32 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ 27, అంగీక్రిష్ రఘువంశీ 24, రమణదీప్ సింగ్ 13, ఆండ్రీ రస్సెల్ 10 పరుగులు చేశారు. కాగా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రింకూ సింగ్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు. కానీ రింకూ 9 పరుగుల కే  ఔటయ్యాడు. వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్ ఇద్దరూ చెరో 3 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు. ఫిలిప్ సాల్ట్,  మిచెల్ స్టార్క్ ఇద్దరూ  కనీసం ఖాతాను కూడా తెరవలేకపోయారు. . వైభవ్ అరోర్ 1 పరుగుతో నాటౌట్ గా వెనుదిరిగాడు. చెన్నై తరఫున రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే చెరో 3 వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రెహమాన్ 2 వికెట్లు తీసి మళ్లీ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. మహిష్ తిక్షణ 1 వికెట్ తీశాడు.

ఇవి కూడా చదవండి

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా,   వరుణ్ చక్రవర్తి.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తిక్షణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Weekly Horoscope: వ్యక్తిగత సమస్యల నుంచి ఆ రాశి వారికి ఊరట..
Weekly Horoscope: వ్యక్తిగత సమస్యల నుంచి ఆ రాశి వారికి ఊరట..
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే బరువుగా అనిపిస్తుందా? కారణం ఏంటంటే..
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే బరువుగా అనిపిస్తుందా? కారణం ఏంటంటే..
పోహా ఫింగర్స్.. చికెన్‌ని కూడా డామినేట్ చేస్తాయి..
పోహా ఫింగర్స్.. చికెన్‌ని కూడా డామినేట్ చేస్తాయి..
మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..
మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..
చీరకట్టులో తళుక్కుమన్న రాకింగ్ స్టార్ భార్య.. లేటెస్ట్ ఫొటోస్
చీరకట్టులో తళుక్కుమన్న రాకింగ్ స్టార్ భార్య.. లేటెస్ట్ ఫొటోస్
ధన్‌తేరస్‌కు 10 రోజుల ముందు రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
ధన్‌తేరస్‌కు 10 రోజుల ముందు రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు..
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు..
టాటా స్టీల్‌ను కాపాడేందుకు తన ఉద్యోగాన్ని వదులుకున్న రతన్‌ టాటా
టాటా స్టీల్‌ను కాపాడేందుకు తన ఉద్యోగాన్ని వదులుకున్న రతన్‌ టాటా
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే ముందు ఇవి గమనించారా? లేకుంటే మోసపోతారు!
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే ముందు ఇవి గమనించారా? లేకుంటే మోసపోతారు!