CSK vs KKR, IPL 2024: కోల్‌కతా వరుస విజయాలకు బ్రేక్.. 7 వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస విజయాలకు బ్రేక్‌ పడింది. చెన్నై సూపర్ కింగ్స్ కేకేఆర్ కు ఈ సీజన్ లో మొదటి ఓటమిని రుచి చూపించింది. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే అద్భుత బౌలింగ్‌ కు తోడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 67 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో

CSK vs KKR, IPL 2024: కోల్‌కతా వరుస విజయాలకు బ్రేక్.. 7 వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం
Chennai Super Kings
Follow us

|

Updated on: Apr 09, 2024 | 12:45 AM

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస విజయాలకు బ్రేక్‌ పడింది. చెన్నై సూపర్ కింగ్స్ కేకేఆర్ కు ఈ సీజన్ లో మొదటి ఓటమిని రుచి చూపించింది. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే అద్భుత బౌలింగ్‌ కు తోడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 67 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ పై సీఎస్కే ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన చెన్నై సొంత మైదానంలో మళ్లీ విజయాల బాట పట్టింది. అజేయంగా నిలిచిన కేకేఆర్ ఈ సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై 17.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి విజయం సాధించింది. చెన్నై తరఫున కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ అత్యధిక పరుగులు చేశాడు. రితురాజ్ 58 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. శివమ్ దూబే 18 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 28 పరుగులు చేశాడు. డారెల్ మిచెల్ 25, రచిన్ రవీంద్ర 15, మహేంద్ర సింగ్ ధోనీ ఒక పరుగుతో నాటౌట్ గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు తీశాడు. సునీల్ నరైన్ 1 వికెట్ తీశాడు.

అంతకు ముందు చెన్నై టాస్ గెలిచి కోల్‌కతాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. చెన్నై బౌలర్లు క్రమం కట్టుదిట్టంగా బంతులేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసింది . కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున శ్రేయాస్ అయ్యర్ 32 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ 27 పరుగులు, అంగ్క్రిష్ రఘువంశీ 24 పరుగులు జోడించారు. చెన్నై తరఫున తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజాలు చెరో 3 వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI:

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్:

రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తిక్షనా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.