AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: వికెట్ల కోసం పోటీ పడుతోన్న బౌలర్లు.. పర్పుల్ క్యాప్ లిస్టులో అగ్రస్థానం ఎవరిదంటే?

Purple Cap: ఐపీఎల్ 2024 (IPL 2024) 22వ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ (CSK vs KKR)ని ఓడించి సీజన్‌లో మూడవ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 137/9 స్కోరు చేయగా, జవాబుగా చెన్నై జట్టు 17.4 ఓవర్లలో 141/3 స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీశారు. అలాగే, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున వైభవ్ అరోరా రెండు వికెట్లు తీశాడు.

IPL 2024: వికెట్ల కోసం పోటీ పడుతోన్న బౌలర్లు.. పర్పుల్ క్యాప్ లిస్టులో అగ్రస్థానం ఎవరిదంటే?
Mustafizur Rahman Purple Ca
Venkata Chari
|

Updated on: Apr 09, 2024 | 7:44 AM

Share

Purple Cap: ఐపీఎల్ 2024 (IPL 2024) 22వ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ (CSK vs KKR)ని ఓడించి సీజన్‌లో మూడవ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 137/9 స్కోరు చేయగా, జవాబుగా చెన్నై జట్టు 17.4 ఓవర్లలో 141/3 స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీశారు. అలాగే, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున వైభవ్ అరోరా రెండు వికెట్లు తీశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ లభిస్తుందనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 16 సీజన్లలో ఎంతోమంది ప్రముఖ బౌలర్లు ఈ క్యాప్‌ను గెలుచుకున్నారు. ఇందులో భారతీయ, విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. గత సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరపున మహ్మద్‌ షమీ అత్యధిక వికెట్లు పడగొట్టాడు.

ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, మహ్మద్ షమీ, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, సోహైల్ తన్వీర్, డ్వేన్ బ్రేవో, లసిత్ మలింగ, మోర్నీ మోర్కెల్, ఆండ్రూ టై, ఇమ్రాన్ తాహిర్, కగిసో రబడ, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నారు. కాగా, ఈ ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన ఐదుగురు బౌలర్లు ఎవరో చూద్దాం?

1) ముస్తాఫిజుర్ రెహ్మాన్ (చెన్నై సూపర్ కింగ్స్): మ్యాచ్‌లు – 4, వికెట్లు – 9, ఎకానమీ రేట్ – 8.00, 4 వికెట్ల హాల్ – 1, ఉత్తమ ప్రదర్శన – 4/29

2) యుజ్వేంద్ర చాహల్ (రాజస్థాన్ రాయల్స్): మ్యాచ్‌లు – 4, వికెట్లు – 8, ఎకానమీ రేట్ – 6.35, 4 వికెట్ల హాల్ – 0, ఉత్తమ ప్రదర్శన – 3/11

3) ఖలీల్ అహ్మద్ (ఢిల్లీ క్యాపిటల్స్): మ్యాచ్‌లు – 5, వికెట్లు – 7, ఎకానమీ రేట్ – 8.50, 4 వికెట్ల హాల్ – 0, ఉత్తమ ప్రదర్శన – 2/21

4) మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్): మ్యాచ్‌లు – 5, వికెట్లు – 7, ఎకానమీ రేట్ – 8.68, 4 వికెట్ల హాల్ – 0, ఉత్తమ ప్రదర్శన – 3/25

5) గెరాల్డ్ కోయెట్జీ (ముంబయి ఇండియన్స్): మ్యాచ్‌లు – 4, వికెట్లు – 7, ఎకానమీ రేట్ – 10.62, 4 వికెట్ల హాల్ – 1, ఉత్తమ ప్రదర్శన – 4/34.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్