PBKS vs SRH, IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది జట్ల వివరాలివే

Punjab Kings vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మంగళవారం జరిగే 23వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చండీగఢ్‌లోని మహారాజా యద్వీంద్ర స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది.

PBKS vs SRH, IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది జట్ల వివరాలివే
PBKS vs SRH Today IPL Match
Follow us
Basha Shek

|

Updated on: Apr 09, 2024 | 11:00 PM

Punjab Kings vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మంగళవారం జరిగే 23వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చండీగఢ్‌లోని మహారాజా యద్వీంద్ర స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో SRH జట్టు 5వ స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టు 6వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో నూ గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక గత రికార్డుల విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. SRH జట్టు 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక్కడ SRH దే పైచేయి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, పంజాబ్ కింగ్స్ నుంచి కూడా గట్టి పోటీని ఆశించవచ్చు.

కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాబట్టి ఎస్ ఆర్ హెచ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. కాగా ఇరు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఇవి కూడా చదవండి

తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన క్లాసెన్.. వీడియో ఇదిగో..

రెండు జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభాసిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐదాన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..