T20 World Cup 2024: హార్దిక్ వద్దు! టీ20 ప్రపంచకప్‌లో వారే ఉండాలి.. టీమిండియా మాజీ క్రికెటర్
రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా మరో ఐసీసీ కప్‌లో ఆడనుంది. గత 11 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఐసీసీ కప్ అందుకునేందుకు భారత జట్టుకు ఇది మరో అవకాశం. ప్రపంచకప్ టోర్నీ అమెరికా, వెస్టిండీస్‌లో జరగనుండగా, ఇందుకోసం ఆటగాళ్లను పరీక్షిస్తున్నారు.
రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా మరో ఐసీసీ కప్‌లో ఆడనుంది. గత 11 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఐసీసీ కప్ అందుకునేందుకు భారత జట్టుకు ఇది మరో అవకాశం. ప్రపంచకప్ టోర్నీ అమెరికా, వెస్టిండీస్‌లో జరగనుండగా, ఇందుకోసం ఆటగాళ్లను పరీక్షిస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులోకి ఎంపికవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే విషయానికి సంబంధించి టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది వెంకటేష్ ప్రసాద్ ముగ్గురి పేర్లను సెలక్షన్ కమిటీకి సిఫార్సు చేశారు. ‘స్పిన్నర్ల పై భారీ షాట్లతో విరుచుకుపడే శివమ్ దూబే జట్టులో ఉండాలి. అలాగే బెస్ట్ టీ T20 ఇంటర్నేషనల్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఫినిషింగ్ కోసం రింకు సింగ్ కూడా టీమ్ లో ఉండాలి. 20 ప్రపంచకప్ లో భారత తుదిజట్టులో ఈ ముగ్గురు ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉండటంతో జట్టులో వికెట్‌కీపర్-బ్యాటర్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. మరి జట్టును ఎలా ఎంపిక చేస్తారో వేచి చూద్దాం’ అని ట్వీట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్. అంటే ఇన్ డైరెక్టుగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కడం కష్టమే అని రాసుకొచ్చాడు వెంకటేష్ ప్రసాద్.
వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఆ తర్వాత లీగ్ రౌండ్‌లోనే పోటీ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత ట్రేడ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్‌కు వచ్చి కెప్టెన్సీని స్వీకరించాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యా నేరుగా ఐపీఎల్ టోర్నీలోకి అడుగుపెట్టాడు. కానీ అతని నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. ఇప్పటి వరకు అతని నాయకత్వంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ముంబై మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. వ్యక్తిగతంగానూ హార్దిక్ పెద్దగా పరుగులు చేయట్లేదు. వికెట్లు తీయలేకపోతున్నాడు. 00కాబట్టి హార్దిక్ పాండ్యా ఎంపిక అవుతాడా లేదా అనేది చూడాలి.
మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున శివమ్ దూబే 160 స్ట్రైక్ రేట్‌తో 176 పరుగులు చేశాడు. ఒ హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించడంలో శివమ్ దూబే దిట్ట. అందుకే వెంకటేష్ ప్రసాద్ ఇచ్చిన ఆప్షన్లను సెలక్షన్ కమిటీ ఎలా నిర్వహిస్తుందన్నదే క్రీడా ప్రేమికుల దృష్టి. ప్రపంచకప్‌కు జట్టు ఎంపికకు గడువు మే 1. కాబట్టి జట్టులో మార్పులు చేసే అవకాశం మే 25 వరకు ఉంటుంది.
వెంకటేష్ ప్రసాద్ ట్వీట్..
Shivam Dube for his striking ability against spinners, Surya for being the best T20 international batter and Rinku Singh for his exceptional finishing ability. It will be great if India finds a way to have these 3 in the 11 in the T20 WC. With Virat and Rohit , this will leave…
— Venkatesh Prasad (@venkateshprasad) April 8, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.