T20 World Cup 2024: పంత్ ఫిక్స్! టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా ఆటగాళ్ల జాబితా సిద్ధం.. ఎవరెవరున్నారంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్-17 ముగిసిన వెంటనే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఈ పొట్టి ప్రపంచ కప్ షురూ కానుంది. ఈ మెగా క్రికెట్ పోరు కోసం అన్ని జట్లు మే 1లోగా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్-17 ముగిసిన వెంటనే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఈ పొట్టి ప్రపంచ కప్ షురూ కానుంది. ఈ మెగా క్రికెట్ పోరు కోసం అన్ని జట్లు మే 1లోగా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం బీసీసీఐ కొంత మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసింది. అయితే ఈ జాబితాలో ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఐపీఎల్ లో అదరగొడుతోన్న రిషబ్ పంత్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం ప్రకారం రిషబ్ పంత్ భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయం. ఎందుకంటే యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న పంత్.. ఇప్పుడు ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రాణించలేకపోతోంది. అయితే, జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం సూపర్బ్ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ అద్భుతమైన బ్యాటింగ్ ఫలితంగా ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు పంత్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.
రిషబ్ పంత్ ఇప్పటివరకు 154.55 స్ట్రైక్ రేట్‌తో 153 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. రిషబ్ పంత్ ఎంపిక దాదాపు ఖరారైన నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ జట్టులో కేఎల్ రాహుల్, జితేశ్ శర్మలకు అవకాశం దక్కడం అనుమానమేనని ప్రచారం సాగుతోంది. అలాగే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ రాబోయే మ్యాచ్‌ల్లో మంచి బ్యాటింగ్ కనబరిస్తే ఇద్దరిలో ఒకరిని రెండో వికెట్ కీపర్ గా ఎంపిక చేయవచ్చని సమాచారం.
ప్రపంచకప్‌లో పాల్గొనే టీమ్ ఇండియా ఆటగాళ్ల పేర్లు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..