IPL 2024: కోట్లు ధారబోసి కొంటే నట్టేట ముంచారు.. ఐపీఎల్‌లో ఆసీస్ ప్లేయర్ ప్లాఫ్ షో
ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా 24 కోట్లకు పైగా ఖర్చు చేసింది .అలాగే కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20 కోట్లను ధార బోసింది. వీరితో పాటు పలువురు పలు ప్రాంఛైజీలు ఆసీస్ ప్లేయర్లపై కోట్ల వర్షం కురిపించాయి.
ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆటగాళ్లదే అగ్రస్థానం. ఇందులో కొంతమందిని IPL 2024 కోసం అలాగే కొనసాగించాయి కొన్ని ప్రాంఛైజీలు. మరి కొందరిని వేలంలో కోట్ల ధారబోసి కొనుగోలు చేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా 24 కోట్లకు పైగా ఖర్చు చేసింది .అలాగే కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20 కోట్లను ధార బోసింది. వీరితో పాటు పలువురు పలు ప్రాంఛైజీలు ఆసీస్ ప్లేయర్లపై కోట్ల వర్షం కురిపించాయి. అయితే కొందరు ప్లేయర్లు మాత్రం తమకు దక్కిన ధరకు పెద్దగా న్యాయం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా KKR 24 కోట్లకు పైగా చెల్లించి స్టార్క్‌ని చేర్చుకుంది. కానీ ఇప్పటివరకు పెద్దగా వికెట్లు తీయలేకపోయాడీ స్పీడ్ స్టర్. పైగా ధారాళంగా పరుగులు చేస్తున్నాడు. స్టార్క్ తో పోల్చుకుంటే కమిన్స్ తనకు వచ్చిన 20 కోట్లకు కాస్త న్యాయం చేస్తున్నాడు. కెప్టెన్సీతో పాటు బౌలింగ్ పాత్రను చాలా సమర్థంగా నిర్వహిస్తున్నాడు.
మిచెల్ మార్ష్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ 6.5 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో పెద్దగా పరుగులు చేయలేదు.ఇక బౌలింగ్‌లో ధారళంగా పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఇది కాకుండా, అతను ఇప్పుడు గాయం కారణంగా ఒక వారం పాటు టోర్నీకి దూరం గా ఉండనున్నాడు.
మిచెల్ ప్రదర్శన ఇది..
Mitchell Starc’s bowling in PP this IPL
Overs: 9 Runs: 90 Wkts: 2 ER: 10.00*#IPL2024 #IPL #Cricket #CricketTwitter #CSKvKKR #KKRvCSK #CSKvsKKR #KKRvsCSK pic.twitter.com/INAwzbkybl
— CricketVerse (@cricketverse_) April 9, 2024
సరిపోయారు ఇద్దరూ..
గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకుంది. అదే సమయంలో స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ను రూ. 17.50 కోట్లకు కొనుగోలు చేసి జట్టులోకి తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు ఐపీఎల్ ఘోరంగా విఫలమవుతున్నారు. మ్యాక్స్‌వెల్ ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 0, 3, 28, 0, 1 పరుగులు మాత్రమే చేశాడు. కామెరాన్ గ్రీన్ కూడా 5, 9, 33, 3 పరుగులు మాత్రమే చేశాడు.
The fearsome pace of young Mayank Yadav. Cameron Green was beaten & clean bowled by an express delivery that held its line. What an exciting prospect this lad is. #LSGvRCB pic.twitter.com/9V0ydtjoc5
— Pramod Kumar Singh (@SinghPramod2784) April 2, 2024
ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు ఆల్ రౌండర్లు మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్ కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు. అయితే గుజరాత్‌పై లక్నో తరఫున స్టోయినిస్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్‌లో టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 45 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.