AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ‘ధోని’ నామస్మరణతో దద్దరిల్లిన స్టేడియం.. దెబ్బకు చెవులు మూసుకున్న రస్సెల్.. వీడియో చూశారా?

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఎప్పటిలాగే చెన్నై అభిమానులు సంబురాలు చేసుకున్నారు. 'ధోనీ.. ధోనీ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, కేకేలు వేశారు. కాసేపు ధోని నామస్మరణతో చిదంబరం స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ రీసౌండ్‌ కు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్‌కు చెందిన..

IPL 2024: 'ధోని' నామస్మరణతో దద్దరిల్లిన స్టేడియం.. దెబ్బకు చెవులు మూసుకున్న రస్సెల్..  వీడియో చూశారా?
Ms Dhoni, Andre Russell
Basha Shek
|

Updated on: Apr 09, 2024 | 5:21 PM

Share

సోమవారం (ఏప్రిల్ 08) రాత్రి జరిగిన ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది . చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఎప్పటిలాగే చెన్నై అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ‘ధోనీ.. ధోనీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, కేకేలు వేశారు. కాసేపు ధోని నామస్మరణతో చిదంబరం స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ రీసౌండ్‌ కు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్‌కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ చెవులు మూసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. మొదట, శివమ్ దూబే వికెట్ పడినప్పుడు ఎంఎస్ ధోని మైదానంలోకి రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రీజీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు నటిస్తూ అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. జడేజా టీజింగ్‌కి ప్రేక్షకులు ఒక్క క్షణం షాక్‌కు గురైతే, ధోనీ మాత్రం తన అలవాటైన స్టైల్‌లో గ్లోవ్స్‌ని సరిచేసుకుంటూ మైదానంలోకి ఎంటర్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ఎంఏ చిదంబరం స్టేడియంలో అభిమానులందరూ ఏకధాటిగా ‘ధోనీ… ధోనీ..’ అంటూ కేకలు వేయడం ప్రారంభించారు. అభిమానుల నినాదాల దెబ్బకు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రస్సెల్ కాసేపు చెవులు మూసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. KKR తరపున శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులు, నరైన్ 27 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లు పూర్తిగా నిరాశపర్చారు.

ధోని.. ధోని .. అభిమానుల హంగామా.. వీడియో

ఇక లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోని చివరి దశలో క్రీజీలోకి వచ్చి అభిమానులను ఉర్రూతలూగించాడు. ధోనీ 3 బంతుల్లో 1 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్