Kajal Karthika OTT: ఉగాది స్పెషల్‌.. భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ ‘కార్తీక’.. ఎక్కడ చూడొచ్చంటే?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం కరుంగా పియం. కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది మే 19న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత కాజల్ కార్తీక పేరుతో తెలుగులోనూ రిలీజై యావరేజ్ గా నిలిచింది

Kajal Karthika OTT: ఉగాది స్పెషల్‌.. భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ 'కార్తీక'.. ఎక్కడ చూడొచ్చంటే?
Kajal Karthika Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 09, 2024 | 9:23 PM

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం కరుంగా పియం. కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది మే 19న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత కాజల్ కార్తీక పేరుతో తెలుగులోనూ రిలీజై యావరేజ్ గా నిలిచింది. పంచదార బొమ్మ లాంటి కాజల్ అగర్వాల్ మొదటిసారిగా ఓ హార్రర్ సినిమాలో నటించడం ఈ మూవీ ప్రత్యేకత. అంతేకాదు 5 వేర్వేరు కథలను ముడిపెట్టి అంత్రాపాలజీగా ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. థియేటర్లలో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న కాజల్ కార్తీక ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఉగాది కానుకగా మంగళవారం (ఏప్రిల్ 09) నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఒరిజెనల్ వెర్షన్ కరుంగా పియం ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడిదే హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియెన్స్ ను భయపెట్టేందుకు ఆహాలోకి వచ్చేసింది.

కాజల్ కార్తీక సినిమాలో విల్సన్‌, యోగిబాబు, జనని, పార్వతి తిరువోతు తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. విగ్నేష్ వాసు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ప్రసాద్. ఎస్. ఎన్. ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. కార్తీక (రెజీనా) సరదాగా ఓ వందేళ్ల నాటి లైబ్రరీకి వెళుతుంది .అక్కడ ‘కాటుక బొట్టు’ అనే తీసుని వెంటనే చదవడం ప్రారంభిస్తుంది. అయితే ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి తన జీవితంలోకి వస్తుంటాయి. అందులో కాజల్‌ అగర్వాల్ (కార్తీక) కూడా ఉంటుంది. పగ తీర్చుకోవాలని దెయ్యంగా మారుతుంది. మరి కార్తీక ఎలా చనిపోయింది. తన పగను ఎలా తీర్చుకుంది? రెజీనాకు, కాజల్ తో సంబంధమేంటో తెలుసుకోవాలంటే కాజల్ కార్తీక మూవీని చూడాల్సిందే. మంచి హార్రర్ సినిమాను చూడాలంటే ఈ మూవీపై ఒక లుక్ వేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న కాజల్ కార్తీక..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..