Aha OTT: సీక్వెల్స్ వచ్చేస్తున్నాయ్.. ఆహాలో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

ఇన్నాళ్లు హిట్ చిత్రాలతో వినోదాన్ని అందించిన ఆహా..ఇప్పుడు తెలుగు నూతన సంవత్సరం ఉగాది కానుకగా ప్రేక్షకులకు డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రోధి నామ సంవత్సరంలో మూవీ లవర్స్‏ కోసం సరికొత్తగా వెబ్ సిరీస్, మూవీస్ రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఎట్లిచ్చినం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ ఆహా అందిస్తోన్న కొత్త వెబ్ సిరీస్, సీక్వెల్స్, మూవీస్ ఎంటో చూద్దామా

Aha OTT: సీక్వెల్స్ వచ్చేస్తున్నాయ్.. ఆహాలో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..
Aha Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2024 | 9:40 PM

మూవీ లవర్స్‏ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తీసుకురావడంలో ముందుంటుంది తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‏లతో ప్రేక్షకులకు అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. అడియన్స్ అభిరుచులకు తగ్గట్లుగా కొత్త కొత్త కంటెంట్ వెబ్ సిరీస్‏లు, సస్పెన్స్ థ్రిల్లర్స్.. సూపర్ హిట్ చిత్రాలను తీసుకువస్తుంది. ఇన్నాళ్లు హిట్ చిత్రాలతో వినోదాన్ని అందించిన ఆహా..ఇప్పుడు తెలుగు నూతన సంవత్సరం ఉగాది కానుకగా ప్రేక్షకులకు డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రోధి నామ సంవత్సరంలో మూవీ లవర్స్‏ కోసం సరికొత్తగా వెబ్ సిరీస్, మూవీస్ రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఎట్లిచ్చినం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ ఆహా అందిస్తోన్న కొత్త వెబ్ సిరీస్, సీక్వెల్స్, మూవీస్ ఎంటో చూద్దామా.

త్రీ రోజెస్.. గతంలో ఆహా ఓటీటీలో సూపర్ హిట్ అయిన సిరీస్ త్రీ రోజెస్. పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బ, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరిస్ కు ఇప్పుడు కొనసాగింపు రాబోతుంది. సీజన్ 2లోనూ వీళ్లే నటించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ర మారుతి క్రియేటర్ గా వ్యవహరించిన ఈ సిరీస్ కు రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఇక ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు మరికొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా ఈ సీజన్ 2లో కనిపించనున్నారని తెలుస్తోంది.

అర్థమయ్యిందా అరుణ్ కుమార్.. గతేడాది ఆహాలో స్ట్రీమింగ్ అయిన అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ కార్పొరేట్ ఉద్యోగి కష్టాల చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సీజన్ 2 తీసుకురాబోతుంది. ఈ సీజన్ 2 ప్రకటిస్తూ లోడింగ్ అనే క్యాప్షన్ ఇచ్చింది ఆహా.

సిన్ సీజన్ 2.. త్రీ రోజెస్ సిరీస్ తోపాటు ఆహాలో హిట్ అయిన మరో సిరీస్ సిన్. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుంది. సీన్ 2 రాబోతున్నట్లు ఆహా అధికారికంగా ప్రటించింది. తిరువీర్, దీప్తి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సిరీస్ ఆకట్టుకుంది. త్వరలోనే సిన్ 2 రాబోతున్నట్లు తెలిపింది ఆహా. వీటితోపాటు.. హరివిల్లు, డ్రైవ్, రాక్షసి, లవ్ డైరీస్ సినిమాలకు కూడా ప్రకటించింది. అలాగే.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, డ్యాన్స్ ఐకాన్ 2, ఆఫీస్ స్టోరీస్, బెంచింగ్ సిరీస్ లను ప్రకటించింది. ఇదిలా ఉంటే ఆహాలో ఇప్పటికే తంత్ర స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమలు ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.