AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆంధ్రా దిలీప్ చలం గుర్తున్నారా.! ఆయన చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసా..

నటుడిగా, నిర్మాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన చలం చివరి రోజులు అన్ని కూడా ఓ కన్నీటి వ్యధ. చార్లీ చాప్లిన్ లాంటి నటులతో పోల్చిన ఆయన.. రంగస్థలం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి.. ఎన్టీఆర్, అక్కినేని లాంటి దిగ్గజాలతో కలిసి నటించారు. ఆయన వైవాహిక జీవితం, చిత్ర నిర్మాణ సంస్థ, మ్యూజికల్ హిట్స్.. ఇలా చూసేద్దాం..

Tollywood: ఆంధ్రా దిలీప్ చలం గుర్తున్నారా.! ఆయన చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసా..
Actor Chalam
Ravi Kiran
|

Updated on: Feb 09, 2026 | 7:29 PM

Share

కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా రకరకాల పాత్రలు పోషించి తన ప్రతిభ చాటుకున్న వ్యక్తి చలం. చార్లీ చాప్లిన్, జిమ్ క్యారీ, రాజ్ కపూర్ లాంటి దిగ్గజ నటుల తరహాలో నవ్విస్తూనే ప్రేక్షకుల్ని ఏడిపించిన అరుదైన నటుడిగా ఆయన పేరు పొందారు. 1929లో కళలకు నిలయమైన పాలకొల్లులో జన్మించిన చలం పూర్తి పేరు కోరాడ సూర్యచలం. ఆనాటి రంగస్థల ప్రముఖుడు పినిశెట్టి శ్రీరామమూర్తికి ఆయన శిష్యులు. తెలుగు నాటక చరిత్రలో పినిశెట్టికి ప్రత్యేక స్థానం ఉంటే, చలం కూడా దాదాపుగా ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. పినిశెట్టి సారధ్యంలో ఆంధ్ర నాటక కళా పరిషత్తులో నటించిన ‘అన్నా చెల్లెలు’, ‘పల్లెపడుచు’ వంటి నాటకాలు నటుడిగా చలం ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డాయి.

1952లో ఎన్టీఆర్ నటించిన ‘దాసి’ చిత్రంతో చలం ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘నా చెల్లెలు’ చిత్రంలో అమర్నాథ్ హీరో కాగా, చలం రెండో హీరోగా నటించారు. సుమారు 30 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో ఉంటూ తనదైన గుర్తింపు సాధించారు చలం. ఎన్టీఆర్, అక్కినేని లాంటి అగ్ర నటుల అభిమానాన్ని చూరగొని, వారి చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. తోడిదొంగలు, భలే రాముడు, వద్దంటే పెళ్లి, పెళ్లి సందడి, పెళ్లి మీద పెళ్లి, ఇలవేలుపు, వదినగారి గాజులు తదితర చిత్రాల్లో చలం కీలక పాత్రలు పోషించారు.

వ్యక్తిగత జీవితంలో కూడా చలం అనేక మలుపులు చూశారు. 1959లో పరిశ్రమలో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకువచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. విజయవాడకు చెందిన వెంకటరమణ ఆయన జీవితంలోకి ప్రవేశించి ఎంతో ప్రభావితం చేశారు. కొంచెం డల్‌గా ఉన్న చలం కెరీర్ పెళ్లైన తర్వాత ఊపందుకోవడంతో సెంటిమెంటుగా భావించి, తన పేరులో అర్ధ భాగాన్ని చేర్చుకుని రమణాచలం అయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. అయితే, 1964లో ఫైర్ యాక్సిడెంట్లో రమణ మరణించారు. ఆమె మరణానంతరం శ్రీ రమణ చిత్ర పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి చిత్రంగా ‘సంబరాల రాంబాబు’ నిర్మించారు. నిర్మాతగా డబ్బు తేవడమే కాకుండా నటుడిగా ఆయన స్థాయిని పెంచిన చిత్రం ‘సంబరాల రాంబాబు’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శారదను ప్రేమించి 1969 మే 1న తిరుపతిలో చలం పెళ్లి చేసుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తు కొన్ని నెలలలోనే చలం పెట్టే టార్చర్‌ను తట్టుకోలేక ఆయన నుంచి విడాకులు తీసుకున్నట్లు శారద ప్రకటించారు.

చలం ఎన్టీఆర్‌ను ‘ఫాదర్’ అని, అక్కినేనిని ‘గురూజీ’ అని పిలిచేవారు. తన తొలి సినిమా ‘దాసి’లో ఎన్టీఆర్‌ను ‘ఫాదర్’ అని పిలవడం అలవాటుగా మారింది. చలం నిర్మించే ప్రతి చిత్రం షూటింగ్ ఓపెనింగ్‌కు ఎన్టీఆర్ వచ్చి ఆశీస్సులు అందించేవారు. ‘పెళ్లి సందడి’ చిత్రంలో అక్కినేనిని ‘గురూజీ’ అని పిలవడం అప్పటి నుంచి అలవాటుగా మారింది. చలానికి పెద్దగా కోపం వచ్చేది కాదు. నవ్వుతూనే మాట్లాడేవారు. ఏదీ సీరియస్‌గా తీసుకోలేదు, చివరికి జీవితాన్ని కూడా. చివరి రోజుల్లో అవకాశాలు తగ్గినా చలం నిరాశ పడలేదు. అలా చిన్న వయసులోనే 1985 ఫిబ్రవరి 19న చలం కన్నుమూయడంతో ఆయన కలలు నెరవేరలేదు.

Follow Us
ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!
ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!
ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం..350 ఏళ్లుగా ఇదే తంతు
ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం..350 ఏళ్లుగా ఇదే తంతు
మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల..
మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల..
లలితా జ్యువెలరీ మార్ట్ IPOకు భారీ డిమాండ్.. GMP రూ.40
లలితా జ్యువెలరీ మార్ట్ IPOకు భారీ డిమాండ్.. GMP రూ.40
ప్రాబ్లమ్స్ వస్తే ఆ హీరోకే కాల్ చేస్తా.. అనుపమ పరమేశ్వరన్..
ప్రాబ్లమ్స్ వస్తే ఆ హీరోకే కాల్ చేస్తా.. అనుపమ పరమేశ్వరన్..
మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
తొలి బంతికే వికెట్.. 43 ఏళ్ల కపిల్ దేవ్ రికార్డు బద్దలు
తొలి బంతికే వికెట్.. 43 ఏళ్ల కపిల్ దేవ్ రికార్డు బద్దలు
ప్రాణదాతలకు అండగా ఏపీ సర్కార్.. అవయవదాన బిల్లుకు శాసనసభ..
ప్రాణదాతలకు అండగా ఏపీ సర్కార్.. అవయవదాన బిల్లుకు శాసనసభ..
చదువుకుంటూనే ర్యాపిడో నడిపిన బీబీఏ విద్యార్థి..! ఏం సంపాదించాడంటే
చదువుకుంటూనే ర్యాపిడో నడిపిన బీబీఏ విద్యార్థి..! ఏం సంపాదించాడంటే
మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా? అక్టోబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌ ఇవే!
మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా? అక్టోబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌ ఇవే!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర