AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Epstein Files: అసలు ఎవరీ ఎప్‌స్టీన్.? ఇంటి నిండా అమ్మాయిల ఫోటోలు, వేలాడి వీడియోలు..

జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ టాపిక్ . భారత్‌లోనూ ఇవి సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికన్ ఫైనాన్షియర్‌గా ఉన్న ఎప్‌స్టీన్ మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో దోషి. విడుదలైన ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ లాంటి ప్రముఖుల పేర్లు కూడా బయటపడ్డాయి. అయితే ఈ ఫైల్స్‌లో పేరున్నంత మాత్రాన ఎవరూ నేరస్థులు కాదని ఆయా ప్రముఖులు స్పష్టం చేశారు.

Epstein Files: అసలు ఎవరీ ఎప్‌స్టీన్.? ఇంటి నిండా అమ్మాయిల ఫోటోలు, వేలాడి వీడియోలు..
Epstein Files
Ravi Kiran
|

Updated on: Feb 09, 2026 | 8:22 PM

Share

జెఫ్రీ ఎప్‌స్టీన్, ఎప్‌స్టీన్ ఫైల్స్ అనే పేర్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్. ఎన్నో వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అమెరికన్ ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్.. ఎలైట్ మెంబర్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తిగా పేరు పొందటమే కాకుండా.. అతితక్కువ కాలంలోనే పలుకుబడి పొందాడు. 2005లో 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొని దోషిగా తేలాడు. 11 ఏళ్ల తర్వాత, మైనర్ బాలికల ట్రాఫ్ఫికింగ్ నెట్‌వర్క్‌ను నడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ 2019 ఆగష్టులో జైలులో మరణించాడు. అతడి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

2005లో ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో తన నివాసంలో ఒక 14 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలలో అతడి ఇల్లంతా అమ్మాయిలు, పిల్లల ఫొటోలు కనిపించాయి. ఈ కేసులో ఎప్‌స్టీన్ దోషిగా తేలి, అడల్ట్ అఫెండర్స్ లిస్టులో చేరాడు. 2008లో ప్రాసిక్యూటర్లతో చేసుకున్న ఒప్పందం ద్వారా తక్కువ శిక్షతో తప్పించుకున్నాడు. అయితే, 11 ఏళ్ల తర్వాత, మైనర్ బాలికల ట్రాఫ్ఫికింగ్ నెట్‌వర్క్‌ను నడిపినట్టు అతడిపై మళ్లీ ఆరోపణలు వచ్చాయి. ట్రాఫికింగ్ ఆరోపణలపై విచారణకు ఎదురుచూస్తూ 2019 ఆగష్టు 10న జైలులో ఎప్‌స్టీన్ మరణించాడు. అతడిది ఆత్మహత్య అని అధికారులు చెప్పినప్పటికీ, లాయర్లు మరికొందరు ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

అతడి మరణం తరువాత చాలా మంది బాలికలు ముందుకు వచ్చి తాము వేధింపులకు గురయ్యామని చెప్పారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా పలుచోట్ల సోదాలు చేసి డాక్యుమెంట్లు, బాధితులు, సాక్షుల స్టేట్‌మెంట్లు, కొన్ని వస్తువులను సేకరించారు. ఎప్‌స్టీన్ భాగస్వామి, మాజీ ప్రియురాలు గిస్లేన్ మ్యాక్స్ వెల్‌కు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలింది. 2021లో ఆమె దోషిగా రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్, మిక్ జాగర్, డయానా రోస్, డాక్టర్ క్రిస్ టక్కర్ వంటి చాలా మంది ప్రముఖుల పేర్లు ఈ ఫైల్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

2025లో అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన మెమో ప్రకారం, ఎఫ్‌బీఐ 300 గిగాబైట్‌లకు పైగా డేటా, భౌతిక ఆధారాలను సేకరించింది. వీటిలో వేధింపులకు గురైన బాలికల ఫొటోలు, వీడియోలు, ఇతర వ్యక్తులకు సంబంధించిన ఈ-మెయిళ్లు, దర్యాప్తులో భాగంగా రికార్డు చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. మొదట్లో ఈ డాక్యుమెంట్స్ బహిర్గతం చేయలేదు. 2025 నవంబర్‌లో అమెరికా కాంగ్రెస్ ‘ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్’ను ఆమోదించింది. రాజకీయ వివాదం అనంతరం అధ్యక్షుడు ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేశారు. ఎప్‌స్టీన్‌పై జరిగిన క్రిమినల్ విచారణలకు సంబంధించిన అన్ని ఫైల్స్‌ను 2025 డిసెంబర్ 19 నాటికల్లా బహిర్గతం చేయాలని ఆదేశించారు. జనవరి 30న అమెరికా న్యాయశాఖ చాలా సమాచారాన్ని విడుదల చేసింది. ఈ ఫైల్స్‌లో 30 లక్షలకు పైగా పేజీలు, 2,000 వీడియోలు, దాదాపు 1 లక్ష 80 వేల ఫొటోలు ఉన్నాయి.