RR vs GT, IPL 2024: పరాగ్, శాంసన్‌ల విరవిహారం.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?

Rajasthan Royals vs Gujarat Titans: సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ఈ సీజన్ లో సూపర్బ్ ఫామ్ లో ఉన్న రియాన్ పరాగ్ తో పాటు కెప్టెన్ సంజూశామ్సన్ మెరుపు అర్థ సెంచరీలు చేశారు. ఫలితంగా గురువారం (ఏప్రిల్ 10) జైపూర్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ ఎదుట..

RR vs GT, IPL 2024: పరాగ్, శాంసన్‌ల విరవిహారం.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?
Rajasthan Royals
Follow us
Basha Shek

|

Updated on: Apr 10, 2024 | 9:51 PM

Rajasthan Royals vs Gujarat Titans: సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ఈ సీజన్ లో సూపర్బ్ ఫామ్ లో ఉన్న రియాన్ పరాగ్ తో పాటు కెప్టెన్ సంజూశామ్సన్ మెరుపు అర్థ సెంచరీలు చేశారు. ఫలితంగా గురువారం (ఏప్రిల్ 10) జైపూర్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ ఎదుట 197 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ తరఫున రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అలాగే సంజూ శాంసన్ 38 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ 24 పరుగులు, జోస్ బట్లర్ 8 పరుగుల చేయగా, షిమ్రాన్ హెట్మెయర్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి 10 ఓవర్లలో రాజస్థాన్‌ బ్యాటర్లు 123 పరుగులు రాబట్టడం విశేషం, గుజరాత్ తరఫున ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.

మెరుపు అర్ద సెంచరీలు చేసిన పరాగ్, శాంసన్..

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ ), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్స్:

రోవ్‌మన్ పావెల్, తనుష్ కోటియన్, శుభమ్ దూబే, కేశవ్ మహారాజ్, నవదీప్ సైనీ

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

శుభ్‌మన్ గిల్ (సి), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వేడ్ (w), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్స్:

శరత్ BR, షారుఖ్ ఖాన్, దర్శన్ నల్కండే, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మానవ్ సుతార్

పరాగ్ పవర్ హిట్టింగ్.. వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..