Ram Charan: ఇకపై డాక్టర్ రామ్ చరణ్.. వేల్స్ వర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్.. వీడియో మీకోసం

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆర్‌ఆర్ ఆర్‌ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన చెర్రీ ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ అయిపోయాడు. శనివారం (ఏప్రిల్ 13) తమిళనాడులోని ప్రఖ్యాత వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.  విద్యార్థుల మధ్య ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో..

Ram Charan: ఇకపై డాక్టర్ రామ్ చరణ్.. వేల్స్ వర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్.. వీడియో మీకోసం
Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Apr 13, 2024 | 8:13 PM

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆర్‌ఆర్ ఆర్‌ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన చెర్రీ ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ అయిపోయాడు. శనివారం (ఏప్రిల్ 13) తమిళనాడులోని ప్రఖ్యాత వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.  విద్యార్థుల మధ్య ఎంతో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో వేల్స్ యూనివర్శిటీ ప్రతినిధుల నుంచి రామ్ చరణ్ డాక్టరేట్ ను స్వీకరించారు. దీంతో రామ్ చరణ్ కాస్తా డాక్టర్ రామ్ చరణ్ గా మారారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చిరంజీవి, నాగబాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు చరణ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంపై ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి  హర్షం వ్యక్తం చేశారు. . ఇది తనను ఓ తండ్రిగా ఎమోషనల్ గా, గర్వించేలా చేస్తుందని ఇదో ఉత్తేజకరమైన క్షణమని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మెగాస్టార్. పిల్లలు వారి విజయాలను అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందమన్నారు.

వేల్స్ వర్సిటీ ప్రతినిధుల నుంచి డాక్టరేట్ అందుకుంటోన్న రామ్ చరణ్, వీడియో ఇదిగో..

చిరంజీవి ట్వీట్ ఇదిగో…

ఇక రామ్ చరణ్ కు డాక్టరేట్ ఇవ్వడంపై ఆయన బాబాయ్ నాగబాబు కూడా స్పందించారు. తమిళనాడు కి చెందిన ప్రముఖ ‘వెల్స్ యూనివర్సిటీ ‘రామ్ చరణ్’ ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించారన్నారు. పిన్న వయసులోనే ఇలాంటి పురస్కారం అందుకున్నందుకు ఒక కుటుంబ సభ్యుడిగా సంతోషిస్తున్నానని, ఒక తెలుగువాడిగా గర్విస్తున్నానని ట్విట్టర్ తెలిపారు మెగా బ్రదర్. చరణ్ బాబు ఇలాంటి మరెన్నో కీర్తి శిఖరాలని అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు నాగబాబు ఆకాంక్షించారు.

బాబాయి అభినందనలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.