Avantika Vandanapu: రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్

Rajeev Rayala

|

Updated on: Apr 13, 2024 | 8:00 PM

నివురు గప్పిన నిప్పులా ఉంటూ.. ఎప్పుడో ఒకప్పుడు బయటి వస్తూనే ఉంటుంది రేసిజమ్. ఇక తాజాగా యంగ్ యాక్టరస్‌ అవంతిక కెరీర్‌ విషయంలోనూ ఇదే అడ్డుగా మారింది. తెలుగులో చైల్డ్‌ ఆర్టిస్ట్ గా చేసి.. ఇప్పుడు హాలీవుడ్‌ లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న అవంతిక పై కొందరు రేసిజమ్ కామెంట్స్ చేస్తున్నారు.

నివురు గప్పిన నిప్పులా ఉంటూ.. ఎప్పుడో ఒకప్పుడు బయటి వస్తూనే ఉంటుంది రేసిజమ్. ఇక తాజాగా యంగ్ యాక్టరస్‌ అవంతిక కెరీర్‌ విషయంలోనూ ఇదే అడ్డుగా మారింది. తెలుగులో చైల్డ్‌ ఆర్టిస్ట్ గా చేసి.. ఇప్పుడు హాలీవుడ్‌ లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న అవంతిక పై కొందరు రేసిజమ్ కామెంట్స్ చేస్తున్నారు. మీన్ గర్ల్స్‌ సినిమాతో పాపులర్ అయిన ఈమె.. మరో ప్రస్టేజియస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. డిస్నీ ఫేమస్ క్యారెక్టర్ ‘రపుంజెల్’ గా కనిపించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఆమె రంగును చూపుతూ.. ఈ క్యారెక్టర్ అవంతిక చేయడానికి వీల్లేదంటూ.. జాత్యాంహంకార కామెంట్స్చేస్తున్నారు కొంత మంది . ఆ క్యారెక్టర్‌ను తెల్లవాళ్లే చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.