Manchu Lakshmi: ఆడపడుచు అంటే నీలా ఉండాలి! మౌనిక డెలివరీ టైంలో అన్నీ తానై చూసుకున్న మంచు లక్ష్మి

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య మౌనికా రెడ్డి రెండు రోజుల క్రితం ఏప్రిల్ 13న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోదరి, మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది

Manchu Lakshmi: ఆడపడుచు అంటే నీలా ఉండాలి! మౌనిక డెలివరీ టైంలో అన్నీ తానై చూసుకున్న మంచు లక్ష్మి
Manchu Lakshmi, Manchu Mano
Follow us

|

Updated on: Apr 15, 2024 | 8:10 PM

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య మౌనికా రెడ్డి రెండు రోజుల క్రితం ఏప్రిల్ 13న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోదరి, మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అలాగే పాపకు ఎమ్ ఎమ్‌ పులి (మంచు మనోజ్ పులి) అని ముద్దు పేరు పెట్టినట్లు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. కాగా మౌనిక ప్రసవ సమయంలో మంచు లక్ష్మీ అన్నీ దగ్గరుండి చూసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలోనే ఉంటూ ప్రతిక్షణం మౌనికకు ధైర్యం చెబుతూ తోడుగా ఉంది. ప్రసవం అనంతరం మనోజ్, మౌనిక, లక్ష్మితో పాటు ఆస్పత్రి వైద్యులు దిగిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇక మంచు మనోజ్, మౌనికల ప్రేమ వివాహం గతేడాది మార్చిలో జరిగింది. ఈ పెళ్లి తన నివాసంలో దగ్గరుండి మరీ చేయించింది మంచు లక్ష్మి. ఇప్పుడు కూడా మౌనిక డెలివరీ సమయంలో దగ్గరుండి మరీ అన్నీ తానై చూసుకుంది. ఈ సందర్భంగా మరోసారి మేనత్తగా మారినందుకు తెగ సంబర పడిపోతుందామె.

ఈ నేపథ్యంలో మంచు లక్ష్మిని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ‘అప్పుడు పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించావు.. ఇప్పుడు డెలివరీ సమయంలో మౌనికకు అండగా ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నావు. ఆడపడుచు అంటే నీలా ఉండాలమ్మా’ అని మంచు లక్ష్మిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచు మనోజ్, మౌనిక గతేడాది మార్చిలో రెండో వివాహం చేసుకున్నారు.అప్పటికే మౌనికకు ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. మంచు లక్ష్మి దగ్గరుండి మరీ వీరి పెళ్లి ఏర్పాట్లు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇంటి దగ్గర పాపతో మనోజ్, మౌనిక దంపతులు.. వీడియో ఇదిగో..

మంచు లక్ష్మి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ప్లేఆఫ్స్‌ అంటే పూనకాలే.. కోల్‌కతా రికార్డులు ఇవే..
ప్లేఆఫ్స్‌ అంటే పూనకాలే.. కోల్‌కతా రికార్డులు ఇవే..
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని
కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌
కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌
వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!
వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!
జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్
జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్
తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధం.. ఓడినా మరో ఛాన్స్..
తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధం.. ఓడినా మరో ఛాన్స్..
యువతలో పెరుగుతోన్న బ్రెయిన్‌ స్ట్రోక్‌.. కారణాలు ఇవే..
యువతలో పెరుగుతోన్న బ్రెయిన్‌ స్ట్రోక్‌.. కారణాలు ఇవే..
డిగ్రీ అర్హతతతో దేశ త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. UPSC ద్వారా ఎంపిక
డిగ్రీ అర్హతతతో దేశ త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. UPSC ద్వారా ఎంపిక
బాలిక మృతిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర వైద్య మండలి ,
బాలిక మృతిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర వైద్య మండలి ,
కోల్‌కతా ప్లేయింగ్ 11లోకి తుఫాన్ ప్లేయర్ ఆగయా..
కోల్‌కతా ప్లేయింగ్ 11లోకి తుఫాన్ ప్లేయర్ ఆగయా..