Kanguva: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. సూర్య ‘కంగువా’ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. ఆ సినిమా గుర్తొస్తోందిగా!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు ' కంగువ ' సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. శివ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు ‘ కంగువ ‘ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. శివ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌ని చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. తాజాగా తమిళ నూతన సంవత్సరం సందర్భంగా కంగువా చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. దీంతో పాటు సినిమా రిలీజ్ పై కీలక అప్టేట్ ఇచ్చింది. ఈ ఏడాది ‘కంగువా’ విడుదల కానుందని చిత్ర బృందం తెలిపింది. అయితే కచ్చితమైన రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలాగే కంగువా సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని స్పష్టత నిచ్చింది.
‘కంగువా’ సినిమాలో సూర్య రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడని ఈ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. ఒకదానిలో కత్తి పట్టుకుని అతను పురాతన కాలం నాటి వ్యక్తిగా, మరొక దాంట్లో తుపాకీ పట్టుకున్నమోడ్రన్ మ్యాన్ గా సూర్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ రెండు పాత్రల్లో ఏదో ఒక పాత్రకు నెగెటివ్ షేడ్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పోస్టర్ ను చూస్తుంటే కల్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా గుర్తొస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కంగువా కొత్త పోస్టర్..
இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துகள்! ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ! ਨਵਾ ਸਾਲ ਮੁਬਾਰਕ! & Happy Ambedkar Jayanthi! #Kanguva pic.twitter.com/MtTGPnzxw3
— Suriya Sivakumar (@Suriya_offl) April 14, 2024
‘కంగువా’ సినిమాతో మొదటిసారిగా దక్షిణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతుంది బాలీవుడ్ నటి దిశా పటాని. ఇక బాబీ డియోల్ కు కూడా ఇది మొదటి తమిళ సినిమా. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ‘స్టూడియో గ్రీన్’, ‘యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంగువా సినిమాను 3డీ ఫార్మాట్‌లో, 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. అందుకే ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది.
కంగువా సినిమాలో బాబీ డియోల్..
Happy birthday #BobbyDeol brother.. Thank you for the warm friendship. It was awesome to see you transform in full glory as the mighty #Udhiran in our #Kanguva Guys watch out for him! @directorsiva @ThisIsDSP @vetrivisuals @StudioGreen2 pic.twitter.com/e3cPBkdMcS
— Suriya Sivakumar (@Suriya_offl) January 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.