Prawns Cleaning: వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది.. పల్లెల్లో ఇదే ట్రెండ్
రొయ్యలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతే కాదు ఇవి రుచికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే చాలా మంది రొయ్యాలను ఇష్టంగా తింటారు. అయితే వీటి విషయంలో చాలా మందికి ఎదురయ్యే సమస్య ఏమిటంటే.. వీటిని ఎలా శుభ్రం చేయాలో చాలా మందికి తెలియదు. అందుకే ఇష్టం ఉన్నా.. వీటిని తెచ్చుకొవడానికి కొంతమంది వెనకాడుతారు. కాబట్టి సులభంగా రొయ్యలను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రొయ్యలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. వీటితో బిర్యానీ నుంచి ఇంట్లో రకరకాల వంటకాలు చేసుకుని ఇష్టంగా తింటారు. అయితే రొయ్యలు వండటంలో అత్యంత ప్రధానమైన, కష్టమైన దశ ఏమిటంటే, వాటిని సరిగ్గా కట్ చేయడం, శుభ్రం చేయడం. చాలా మంది పొట్టు తీసేసి, నీళ్లతో కడిగేస్తే పని అయిపోయిందని అనుకుంటారు. కానీ కొందరి షెఫ్‌ల ప్రకారం.. రొయ్యలను కడగడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుందట. వాటిని సరైన పద్ధతిలో కడగకపోతే.. కర్రీలో నీచు వాసన వస్తుందట. అంతేకాకుండా కడుపు నొప్పి లేదా అజీర్ణం వంటి సమస్యలు కూడా రావచ్చట. కాబట్టి రొయ్యలను సరిగ్గా ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం.
రొయ్యలను సరైన పద్దతిలో ఎలా శుభ్రం చేయాలి?
నీచు వాసన రాకుండా ఇలా క్లీన్ చేయండి
రొయ్యలకు ఒక రకమైన తీవ్రమైన నీచు వాసన ఉంటుంది, ఇది చాలా మందికి నచ్చదు. మామూలు నీళ్లతో ఎన్నిసార్లు కడిగినా ఈ వాసన పూర్తిగా పోదు, పైగా రొయ్యల రుచి కూడా తగ్గిపోవచ్చు. ఈ వాసనను పోగొట్టడానికి అత్యంత సులువైన చిట్కా ఏదైనా ఉందంటే.. వాటికి ఉప్పు, నిమ్మరసం లేదా వెనిగర్ వేసి కడగడం. అవును రొయ్యలకు ఉన్న నీచు వాసన త్వరగా పోవాలంటే మీరు రొయ్యలను కట్ చేసిన తర్వాత మొదట ఒకసారి మామూలు నీటితో బాగా కడగాలి.
ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి, అందులో కొద్దిగా ఉప్పు, ఒక చెంచా నిమ్మరసం లేదా తెల్ల వెనిగర్ వేసి బాగా కలిపి 5 నుండి 7 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ క్రమంలో నిమ్మకాయలోని యాసిడ్ గుణాలు రొయ్యల లోపల ఉండే నీచు వాసనను పూర్తిగా పీల్చేస్తాయి, రొయ్యల ముక్కలు మెత్తబడకుండా గట్టిగా ఉండేలా చేస్తాయి. 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మరోసారి కడిగేస్తే రొయ్యలు పూర్తిగా వాసన లేకుండా శుభ్రపడతాయి.
రెస్టారెంట్ తరహా మెరుపు కోసం
పెద్ద పెద్ద రెస్టారెంట్లలో రొయ్యలను కడగడానికి ఒక అద్భుతమైన ట్రిక్ ఉపయోగిస్తారు. దీనివల్ల పచ్చి రొయ్యలు కూడా గాజులా స్వచ్ఛంగా, తెల్లగా మెరిసిపోతాయి. మీరు ఇంట్లో కూడా అదే తరహాలో వాటిని క్లీన్ చేయవచ్చు. ఇందుకోసం నీరు వడకట్టిన రొయ్యలపై ఒక చెంచా మైదా పిండి లేదా కార్న్‌ఫ్లోర్ చల్లి, చేత్తో తేలికగా రుద్దాలి. మైదా పిండి రొయ్యలపైన ఉండే జిగురును, జిడ్డును, సూక్ష్మమైన మురికిని తన వైపుకు లాగేసుకుంటుంది. ఆ తర్వాత ట్యాబ్ కింద చల్లటి నీటితో కడిగేస్తే రొయ్యలు శుభ్రంగా అవుతాయి. ఈ పద్ధతిలో కడగడం వల్ల ఫ్రైడ్ రైస్ లేదా చిల్లీ ప్రాన్స్ కోసం రొయ్యలను వేయించేటప్పుడు అవి బాణలికి అంటుకోవు.
వేడి నీటిని అస్సలు వాడకండి
అయితే చాలా మంది రొయ్యలను కడిగేటప్పుడు గోరువెచ్చని లేదా వేడి నీటిని వాడుతుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రొయ్యలను కడగడానికి ఎప్పుడూ చల్లటి నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకు అంటే వేడి నీటిని ఉపయోగించడం వల్ల రొయ్యల పైభాగం పాక్షికంగా ఉడిపోతుంది. దీనివల్ల రొయ్యల లోపల ఉండే సహజమైన జ్యూసీదనం పోతుంది. అలాగే వండిన తర్వాత రొయ్యలు రబ్బరులా గట్టిగా తయారవుతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
