AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Satya Sri: ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా.. ఆ తర్వాత నన్ను పిలిచి..

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లేడీ కమెడియన్ సత్యశ్రీ కూడా ఒకరు. చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను బాగా నవ్వించాయి. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తోంది.

Jabardasth Satya Sri: ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా.. ఆ తర్వాత నన్ను పిలిచి..
Jabardasth Satya Sri
Basha Shek
|

Updated on: Jun 09, 2026 | 7:25 PM

Share

జబర్దస్త్ కామెడీ షోలోకి లేడీ కమెడియన్ల ఎంట్రీ సత్య శ్రీ తోనే మొదలైందని చెప్పవచ్చు. అంతకు ముందు మేల్ కంటెస్టెంట్లే అమ్మాయిలా లేడీ గెటప్పులు వేసి స్కిట్స్ చేసేవారు. అయితే సత్య శ్రీ ఈ ట్రెండ్‌ని మార్చేసిందని చెప్పవచ్చు.చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లోనూ వీరి స్కిట్లకు భారీగా వ్యూయర్ షిప్ వచ్చింది. సత్య శ్రీ తర్వాతనే వర్ష, రోహిణి, పవిత్ర, ఫైమా తదితర లేడీ కమెడియన్లు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తమ ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. కాగా జబర్దస్త్ లోకి రాక ముందు పలు షార్ట్ ఫిల్మ్స్ చేసింది సత్య శ్రీ. ఆ క్రేజ్ తోనే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే చమ్మక్‌ చంద్రకి సినిమా ఆఫర్లు రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేశారు. ఆయనతో పాటే సత్యశ్రీ కూడా వెళ్లిపోయింది. ఆ తర్వాతనే చమ్మక్‌ చంద్రతో కలిసి ‘అదిరింది’ అనే షోలో యాక్ట్ చేసిందీ లేడీ కమెడియన్. మరోవైపు సినిమాల్లోనూ అవకాశాలు సంపాదించుకుంది. అవకాశాలను అందుకుంది సత్యశ్రీ. జబర్దస్త్ ను విడచి పెట్టిన తర్వాత ‘రాజా ది గ్రేట్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’, ‘సిల్లీ ఫెలోస్‌’, ‘ఎఫ్ 3’, ‘రారండోయ్‌ వేడుక చేద్దాం’ తదితర సినిమాల్లో వివిధ పాత్రలు పోషించింది సత్యశ్రీ. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన సత్యశ్రీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘నేను పవన్ కల్యాణ్ కు వీరాభిమానిని. ఆయన నటంచిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో నాకు నటించే అవకాశం వచ్చింది. షూటింగ్ దగ్గరికి వెళ్లాను. తీరా చూస్తే అక్కడ క్లబ్ లో ఓ డ్యాన్స్ సీన్ చేస్తున్నారు. నాకు ముందు చెప్పింది ఒకటి. అక్కడ చేస్తున్నది ఒకటి. నాకు నచ్చలేదు. వెంటనే చేయనని చెప్పి బయటకు వచ్చేశాను. పవన్ కల్యాణ్ సినిమా అయినా ఆలోచించకుండ బయటకు వచ్చేశాను. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరో పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట. వెంటనే ఆయన నన్ను పిలిపించారు. ఎందుకు నటించనని చెప్పావట? అని అడిగారు. ‘నాకు భయం వేసింది సర్. అందుకే చేయను’ అని చెప్పేశా. ఆ తర్వాత మీది ఏ ఊరు? అని అడిగారు. తణుకు అని చెప్పాను. కాసేపు మాట్లాడి, నాకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఇక వెళ్లు అన్నారు. వెళ్లేటప్పుడు ఫొటో కావాలని అడిగితే ఇచ్చారు. పవన్ కల్యాణ్ తో మాట్లాడిన తర్వాత ఆయన మీద గౌరవం మరింత ఎక్కువ అయ్యింది’ అని అప్పటి క్షణాలను గుర్తుకు తెచ్చుకుంది సత్యశ్రీ.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ సత్యశ్రీ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Satya Sri (@me_satyasri)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us