AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఎన్టీఆర్‌తో హిట్ సినిమా

హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా ఒకటి, రెండు ఫ్లాపు సినిమాలు పడితే చాలు.. సినిమా ఛాన్సులు కరువైపోతాయి. అలా సినిమా అవకాశాల్లేక ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

Tollywood: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఎన్టీఆర్‌తో హిట్ సినిమా
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 08, 2026 | 4:50 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జగపతిబాబు తదితర హీరోల సినిమాల్లోనూ కథానాయికగా నటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, భోజ్ పురి సినిమాల్లోనూ యాక్ట్ చేసి అక్కడి ఆడియెన్స్ ను అలరించింది. కేవలం సినిమాలే కాదు బుల్లితెరపైనా సత్తా చాటింది. అయితే చాలా మంది లాగే ఈ హీరోయిన్ కు కూడా సినిమా అవకాశాలు కరువయ్యాయి. తెలుగులో మంచి సినిమాలే చేసినా సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లి చేసుకుని ఇంటికే పరిమితమైంది. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. తన ఫ్యామిలీ ఫొటోస్, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. అలాగే లిప్ సింకింగ్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలను కూడా పంచుకుంటోంది.

మరి పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు సోనాలి జోషి. అదేనండి.. ఎన్టీఆర్ సుబ్బు మూవీలో హీరోయిన్. 2001లో వచ్చిన సుబ్బు సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ముఖ్యంగా ఇందులోని పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సుబ్బు తో పాటు ‘అభి’, ‘సందడే సందడి’, ‘నాన్న నేను అబద్ధం’ ‘రాంబాబు గాడి పెళ్ళాం’ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ ఈ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో సోనాలికి మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.

ఇవి కూడా చదవండి

అప్పుడు స్లిమ్ గా, ఇప్పుడు బొద్దుగా..

సోనాలి జోషి ఈ మధ్యన సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అయితే సుబ్బు సినిమాలో చాలా స్లిమ్ గా కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు బొద్దుగా గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది.

అభి సినిమాలో సోనాలి జోషి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు