AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 7 కోట్లతో తీస్తే 1700 కోట్ల కలెక్షన్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్!

గత నెలలో థియేటర్లలో విడుదలైన ఓ హారర్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కనివినీ ఎరుగని కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ. 7.12 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, ఇప్పటికే రూ. 1697 కోట్లకు పైగా వసూలు చేయడం గమనార్హం.

OTT Movie: 7 కోట్లతో తీస్తే 1700 కోట్ల కలెక్షన్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్!
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 08, 2026 | 3:25 PM

Share

ప్రస్తుతం ఒక హారర్ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతోంది. దర్శకుడు కర్రీ బార్కర్ రూపొందించిన ఈ సైకలాజికల్ హారర్ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది.అలాగనీ ఈ సినిమాలో భారీ తారగణమేమీ లేదు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ లేవు. స్పెషల్ సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లు లేవు. వందల కోట్ల బడ్జెట్ మూవీ కూడా కాదు. కేవలం రూ.7.12 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, ఇప్పుడు వేల కోట్ల రూపాయల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. తద్వారా కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాకైనా ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడి వస్తారన్న నమ్మకాన్నిఈ హారర్ సినిమా నిజం చేసింది. ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ప్రస్తుతం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లెక్కలు సరి చేస్తోన్న అబ్సెషన్ మూవీ గురించే ఈ డిస్కషన్ అంతా. హాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం, ‘అబ్సెషన్’ చిత్రాన్ని కేవలం $750,000 బడ్జెట్‌తో నిర్మించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 7.12 కోట్లు. కానీ బాక్సాఫీస్ వసూళ్లను చూస్తే, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,697.51 కోట్లు ($178.78 మిలియన్లు) వసూలు చేసింది. అంటే, ఇది తన బడ్జెట్ కంటే 230 రెట్లు ఎక్కువ వసూలు చేసిందన్నమాట! సాక్లింక్ నివేదిక ప్రకారం, ఈ హారర్ చిత్రం భారతదేశంలో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. అంతర్జాతీయంగా మే 14న విడుదలైన ఈ మూవీ.. మే 29న భారతదేశంలో గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటివరకు ఇండియాలో ఈ సినిమా రూ. 34.15 కోట్ల మొత్తం గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే ఈజీగా రూ. 3,000 కోట్లను దాటే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తోన్న ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుందని ప్రచారం జరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం జూన్ 15 లేదా 22 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. కాగా ‘అబ్సెషన్’ మొదట పీకాక్‌లో స్ట్రీమ్ అయి, ఆ తర్వాత కొన్ని నెలల పాటు నెట్‌ఫ్లిక్స్‌కు మారవచ్చని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. ఇక ఇండియాలో ఈ మూవీ జియో హాట్‌స్టార్ లేదా నెట్‌ ఫ్లిక్స్ లేదా మరేదైనా ఓటీటీలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే నేరుగా సబ్‌స్క్రైబర్లందరికీ ఉచితంగా కాకుండా.. ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ పద్ధతిలో సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే రెంటల్ బేసిస్ లో అన్నమాట. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. అబ్సెషన్ మూవీకి వస్తోన్న వసూళ్ల దృష్ట్యా ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కావొచ్చునని కూడా ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us