AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు.. మీ రాశికి ఎలా ఉందంటే..?

Horoscope Today(June 10, 2026): బుధవారం రాశిఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి అదనపు ఆదాయ అవకాశాలు కలిసివస్తే, వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. మిథున రాశి వారు ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించి కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయో తెలుసుకుందాం.

జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు.. మీ రాశికి ఎలా ఉందంటే..?
Horoscope Today 10 June 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 10, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూన్ 10, 2026): మేష రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. మిథున రాశి వారు ఆర్థిక సమస్యల్ని, ఒత్తిళ్లను అధిగమిస్తారు. అదనపు ఆదాయం కోసం శ్రమపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. కొత్త ప్రయత్నాలకు ఇది మంచి సమయం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. వృత్తి జీవితంలో సమస్యల్ని చాలావరకు అధిగమిస్తారు. కుటుంబంలో బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా, ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. కొందరు మిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గ్రహ బలం బాగున్నందువల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల్ని, ఒత్తిళ్లను అధిగమిస్తారు. అదనపు ఆదాయం కోసం శ్రమపడతారు. అయితే, కొన్ని వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సామరస్యంగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఇంటా బయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. కుటుంబ జీవితం చాలావరకు అన్యోన్యంగా సాగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో బాగా శ్రద్ధ తీసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయంలో కొద్దిపాటు పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చుల్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో మీ శ్రమ, ప్రతిభ మరింతగా గుర్తింపు లభిస్తుంది. అధి కారులు, సహోద్యోగులకు బాగా ఉపయోగపడతారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి లాభాలు పెంచుకుంటారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. సహాయం పొందిన మిత్రులు ముఖం చాటేస్తారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని తగ్గించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సరైనరీతిలో ప్రయత్నాలు సాగించే పక్షంలో అనుకున్నవన్నీ సాఫీగా పూర్తవుతాయి. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఇష్టమైన బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని చక్కబెట్టుకోవడం చాలా మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందిన కొందరు మిత్రులు ఇప్పుడు మొహం చాటేస్తారు. ఏ విషయంలోనూ ఎవరి మీదా ఆధారపడకపోవడం మంచిది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మనసులోని ఒకటి రెండు ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది చాలా అనుకూల మైన సమయం. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. దైవ కార్యాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరిస్థితుల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులపైన ఖర్చు బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. కుటుంబ పెద్దల సహకారంతో ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచి పోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఒక శుభవార్త అందుతుంది.

Follow Us
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో