AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Blessings: గురు బలం.. ఈ నక్షత్రాల వారు నక్క తోకను తొక్కినట్టే..!

Star Astrology: కర్కాటక రాశిలో గురు గ్రహం ఉచ్ఛ స్థితిలో ఉండటంతో, గురువు సంబంధిత పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాల వారికి అనుకూల ఫలితాలు కలగనున్నాయి. అలాగే చంద్రునికి చెందిన రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల వారు కూడా బలాన్ని పొందుతారని సూచనలు ఉన్నాయి. అక్టోబర్ 31 వరకు ఈ ఆరు నక్షత్రాల వారికి రాజయోగాలు, ధనయోగాలు ఏర్పడి, ముఖ్య కోరికలు నెరవేరే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి, విదేశ ఉద్యోగ అవకాశాలు కూడా సులభంగా లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

Guru Blessings: గురు బలం.. ఈ నక్షత్రాల వారు నక్క తోకను తొక్కినట్టే..!
Jupiter Blessings Star Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 1:51 PM

Share

ప్రస్తుతం కర్కాటక రాశిలో గురు గ్రహం ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల గురువుకు సంబంధించిన నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాల వారికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశికి అదిపతి అయిన చంద్రుడికి సంబంధించిన రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు కూడా గురువు ఉచ్ఛ స్థితి కారణంగా బలం పుంజుకోవడం జరుగుతుంది. ఫలితంగా అక్టోబర్ 31 వరకు ఈ ఆరు నక్షత్రాల వారు చక్ర తిప్పే అవకాశం ఉంది. వీరికి రాజ యోగాలు, ధన యోగాలతో పాటు, మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరడం జరుగుతుంది. సంతాన ప్రాప్తికి, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల ఫలించడానికి కూడా అవకాశం ఉంది.

  1. రోహిణి: చంద్రుడికి చెందిన ఈ నక్షత్రం వృషభ రాశిలో ఉన్నందువల్ల నాలుగు నెలల పాటు వీరికి ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తూనే ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.
  2. పునర్వసు: గురువుకు చెందిన ఈ నక్షత్రం కర్కాటక రాశిలో ఉన్నందువల్ల ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఇక నుంచి దశ తిరుగుతుంది. జీవన శైలి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ది చెందుతుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.
  3. హస్త: చంద్రుడికి చెందిన ఈ నక్షత్రం కన్యా రాశిలో ఉంది. ఈ నక్షత్రం వారికి రాజపూజ్యాలతో పాటు రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. రాజభోగాలు అనుభవిస్తారు. తప్పకుండా ఐశ్వర్య వంతులవుతారు. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.
  4. విశాఖ: ఈ నక్షత్రానికి గురువు అధిపతి కావడం, ఆ గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ నక్షత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక పర్యాయాలు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. మదుపులు, పెట్టుబడులు రెట్టింపు లాభాలనిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. వృథా ఖర్చుల్ని, తగ్గించుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉన్నత స్థితిలో ఉంటుంది.
  5. శ్రవణం: చంద్రుడికి చెందిన ఈ నక్షత్రం మకర రాశిలో ఉంది. ఈ నక్షత్రానికి చెందినవారు నాలుగు నెలల పాటు ఒక వెలుగు వెలగడం జరుగుతుంది. వీరు ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కుతారు. ఒక సంస్థకు ఉన్నతాధికారి లేదా సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు బాగా బిజీగా సాగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.
  6. పూర్వాభాద్ర: గురువుకు చెందిన ఈ నక్షత్రం కుంభ, మీన రాశుల్లో ఉంది. గురువు ఉచ్ఛస్థితి వల్ల ఈ నక్షత్రం వారికి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఊహించని రాజయోగాలు కలగబోతున్నాయి. రాజకీయాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.

Follow Us