- Telugu News Photo Gallery Cricket photos IPL 2024:Indian Tennis Star Mahesh Bhupathi slams Royal Challengers Bengaluru
IPL 2024: రూ. 47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే!! ఆర్సీబీని అమ్మిపారేయండి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్-17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. 7 మ్యాచ్‌ల ప్రథమార్థంలో RCB కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఆర్‌సీబీ ఈ పేలవ ప్రదర్శనకు ఆ జట్టు స్టార్ ఆటగాళ్లే కారణం.
Updated on: Apr 16, 2024 | 10:41 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్-17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. 7 మ్యాచ్‌ల ప్రథమార్థంలో RCB కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఆర్‌సీబీ ఈ పేలవ ప్రదర్శనకు ఆ జట్టు స్టార్ ఆటగాళ్లే కారణం.

ఎందుకంటే ఆర్సీబీ జట్టులోని స్టార్ ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నారు. అందువల్ల, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో, ప్లేయింగ్ ఎలెవన్‌లో కొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లను తప్పించారు.

RCB ఫ్రాంచైజీ ఖర్చు చేసింది మొత్తం 100 కోట్లు. అయితే ఎస్ ఆర్ హెచ్ తో మ్యాచ్ లో సుమారు 47 కోట్లు అందుకున్న ఆటగాళ్లు ఆడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది RCB ఫ్రాంచైజీ దీన పరిస్థితికి నిదర్శనమంటున్నాడు టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి.

కామెరాన్ గ్రీన్ (రూ.17.5 కోట్లు), అల్జారీ జోసెఫ్ (రూ.11.5 కోట్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ.7 కోట్లు) ఇలా స్టార్ ఆటగాళ్లంతా రిజర్వ్ బెంచ్ పై కూర్చున్నారు.

ఆర్సీబీ అభిమాని అయిన మహేశ్ భూపతి బీసీసీఐ చొరవ తీసుకుని ఆర్సీబీని కొత్త యాజమాన్యానికి అప్పగించాలని సూచించాడు. ఆర్సీబీ తాజా ప్రదర్శన చాలా బాధాకరం అంటూ భూపతి తన ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.