- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2024: Rohit Sharma Meets Rahul Dravid And Ajit Agarkar For T20I World Cup 2024
Team India: హార్దిక్ ఫ్యూచర్ రోహిత్ చేతుల్లో.. ద్రవిడ్, అగార్కర్‌తో కీలక చర్చలు..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన హార్దిక్ పాండ్యా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ వైఫల్యం మధ్య ఇప్పుడు హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పుకునే ముప్పును ఎదుర్కొంటున్నాడు. అందువల్ల ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ ఐపీఎల్ ద్వితీయార్థంలో అద్భుత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
Updated on: Apr 17, 2024 | 4:17 PM

బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్, భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను కలిశారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ముగ్గురూ సమావేశమై త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు జట్టు ఎంపికపై చర్చించినట్లు సమాచారం.

ఈ ప్రత్యేక సమావేశంలో హార్దిక్ పాండ్యా ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా ఆల్‌రౌండర్‌గా ఎంపిక కావాలంటే బౌలింగ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. కానీ, ప్రస్తుత ఐపీఎల్ టోర్నీలో పాండ్యా ప్రదర్శన నిరాశపరిచింది.

హార్దిక్ పాండ్యా ఆరు మ్యాచ్‌ల్లో 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అదే సమయంలో అతను ఓవర్‌కు 12 సగటుతో మొత్తం 132 పరుగులు ఇచ్చాడు. అలాగే 6 మ్యాచ్‌ల నుంచి 131 పరుగులు మాత్రమే వచ్చాయి.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న శివమ్ దూబే అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. మిడిలార్డర్‌లో తుఫాన్ బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన దూబే.. 163 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 242 పరుగులు చేశాడు.

దీని కారణంగా హార్దిక్ పాండ్యాను టీమిండియా ప్రపంచకప్ జట్టులో ఆల్ రౌండర్‌గా ఎంపిక చేయాలా? శివమ్ దూబేకి అవకాశం ఇవ్వాలా వద్దా అని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అయోమయంలో పడింది.

దీనిపై రోహిత్ శర్మతో అజిత్ అగార్కర్ చర్చించగా.. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఈ నెలాఖరున మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశం తర్వాత టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.





























