T20 World Cup 2024: ఈ ముంబై ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో నో ఛాన్స్! భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే టీమ్ ఇండియా ఎంపికపై చర్చ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే టీమిండియాను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ టోర్నీ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ 20 మంది ఆటగాళ్ల జాబితాను రూపొందించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

T20 World Cup 2024: ఈ ముంబై ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో నో ఛాన్స్! భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?
Teamindia
Follow us
Basha Shek

|

Updated on: Apr 18, 2024 | 8:30 PM

ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా జరుగుతున్నప్పటికీ చాలా మంది దృష్టి టీ20 ప్రపంచకప్. జూన్ 2 నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే టీమ్ ఇండియా ఎంపికపై చర్చ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే టీమిండియాను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ టోర్నీ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ 20 మంది ఆటగాళ్ల జాబితాను రూపొందించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందులో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్ల పేర్లు లేవు. పీటీఐ కథనం ప్రకారం, టీమ్ ఇండియా త్వరలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించనుంది. స్టాండ్‌బైగా 5 మంది ఆటగాళ్లు జట్టుతో పాటు ఉంటారు. నివేదికల ప్రకారం, టీ20 ప్రపంచకప్ జట్టులో టీమ్ ఇండియా మొత్తం 6 మంది స్పెషలిస్ట్ బ్యాటర్లకు ఎంపిక చేస్తుంది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ పేర్లు ఉన్నాయి.

అలాగే టీ20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా నలుగురు ఆల్ రౌండర్లను ఉంచవచ్చు. ఇందులో మొదటగా వినిపిస్తున్న పేరు రవీంద్ర జడేజా. అంతే కాకుండా అక్షర్ పటేల్ కూడా ఈ రేసులో ఉన్నారు. హార్దిక్ పాండ్యా కూడా టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవడం ఖాయమని భావిస్తున్నారు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ శివమ్ దూబే కూడా ఈ రేసులోకి వచ్చాడు. టీ20 ప్రపంచకప్‌కు ముగ్గురు వికెట్‌కీపర్లను టీమ్ ఇండియా ఎంపిక చేయవచ్చు. ఇందులో రిషబ్ పంత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రోడ్డు ప్రమాదం కారణంగా, పంత్ ఏడాదిన్నర పాటు క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ మైదానంలోకి వచ్చాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు కాబట్టి అతని పేరు ఫిక్స్ అయ్యిందని సమాచారం. అంతే కాకుండా సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉండొచ్చు. ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కీపర్‌ రేసులో లేనట్టే.

బౌలర్లు వీరే..

టీ20 ప్రపంచకప్ జట్టులో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉంటారు. ఇందులో మొదటి పేరు కుల్దీప్ యాదవ్. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ కూడా రేసులో ఉన్నారు. ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఎంపిక లాంఛనమే. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు అవేష్ ఖాన్ కూడా టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాలో ఎంపికయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్/శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్, కుల్‌దీప్, బుమ్రా మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.

రిజర్వ్‌లు:

రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్.

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!