PBKS vs MI, IPL 2024: దంచికొట్టిన సూర్య కుమార్.. తిలక్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

Punjab Kings vs Mumbai Indians: ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచ కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చాడు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. కేవలం 53 బంతుల్లో 78 పరుగులు సాధించి ముంబై భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

PBKS vs MI, IPL 2024: దంచికొట్టిన సూర్య కుమార్.. తిలక్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
Surya Kumar Yadav
Follow us

|

Updated on: Apr 18, 2024 | 9:47 PM

Punjab Kings vs Mumbai Indians: ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచ కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చాడు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. కేవలం 53 బంతుల్లో 78 పరుగులు సాధించి ముంబై భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్‌ శర్మ (25 బంతుల్లో 36, 2 ఫోర్లు, 3 సిక్స్ లు), తిలక్‌ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అంతకు ముందు ఇషాన్‌ కిషన్‌ (8), హార్దిక్‌ పాండ్య (10), టిమ్ డేవిడ్‌ (14) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్‌ కరన్‌ 2, రబాడా ఒక్కో వికెట్‌ తీశారు.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్‌ కు శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు తొలి షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ 8 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు  81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ 25 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 3 సిక్సర్లు, 2 ఫోర్లు   ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 53 బంతుల్లో 78 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్‌లో ప్రభాసిమ్రన్ సింగ్ కు క్యాచ్ఇచ్చాడు. టిమ్ డేవిడ్ 6 బంతుల్లో 14 పరుగుల వద్ద ఔటయ్యాడు. 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. షెపర్డ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ కేవలం 1 పరుగుకే ఔటయ్యాడు. చివరి బంతికి మహ్మద్ నబీ ఔటయ్యాడు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, జెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

ఆకాష్ మధ్వల్, నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, నమన్ ధీర్

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రిలే రోసో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కుర్రాన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రాహుల్ చాహర్, విధ్వత్ కావరప్ప, హర్‌ప్రీత్ భాటియా, శివమ్ సింగ్, రిషి ధావన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
నా కెరీర్ లో అవి చీకటి రోజులు.! ప్రియాంక చోప్రా కామెంట్స్.
నా కెరీర్ లో అవి చీకటి రోజులు.! ప్రియాంక చోప్రా కామెంట్స్.
లైవ్‌లో ఓవర్ యాక్షన్.. కట్‌చేస్తే.. ఒక మ్యాచ్ నుంచి సస్పెషన్
లైవ్‌లో ఓవర్ యాక్షన్.. కట్‌చేస్తే.. ఒక మ్యాచ్ నుంచి సస్పెషన్
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం