Pushpa 2: బాలీవుడ్‌లో బన్నీ క్రేజ్.. కళ్లు చెదిరే ధరకు పుష్ప 2 థియేట్రికల్ రైట్స్.. ఏకంగా అన్ని కోట్లా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్, డిమాండ్ రెండూ ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప 2’ సినిమాపైనే ఉంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది

Pushpa 2: బాలీవుడ్‌లో బన్నీ క్రేజ్.. కళ్లు చెదిరే ధరకు పుష్ప 2 థియేట్రికల్ రైట్స్.. ఏకంగా అన్ని కోట్లా?
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: May 16, 2024 | 8:21 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్, డిమాండ్ రెండూ ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప 2’ సినిమాపైనే ఉంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అత్యంత గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏకంగా 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం . ఈ వార్త విన్న అల్లు అర్జున్ అభిమానులు థ్రిల్ అఅవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ సినిమా రాబోతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. పాన్ ఇండియాలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళం వంటి భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు.

ఉత్తర భారతదేశంలో హిందీ ప్రేక్షకులు ఎక్కువ. దక్షిణాది నుండి హిందీలోకి డబ్ చేయబడిన సినిమాలకు ఉత్తర భారతదేశం అతిపెద్ద మార్కెట్. అక్కడ దక్షిణాది సినిమాలు రిలీజ్ చేస్తే భారీ వసూళ్లు రాబడుతాయి. దీంతో ‘పుష్ప 2’ సినిమా హిందీ వెర్షన్‌కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నివేదికల ప్రకారం, అనిల్ తడాని హిందీ వెర్షన్ ‘పుష్ప 2’ని పంపిణీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందు కోసం అతను 200 కోట్లు ఖర్చు చేశాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ చూసి అల్లు అర్జున్ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. పాటలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఆడియో రిలీజ్ తర్వాత క్రేజ్ మరింత పెరుగుతుంది. అలాగే ‘పుష్ప 2’ సినిమా ఆడియో రైట్స్ (అన్ని భాషలతో కలిపి) రూ.60 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. రిలీజ్ కుముందే అన్ని రకాల రైట్స్ కలిపి పుష్ప 2 సినిమాకు ఏకంగా రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇందులో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ డాలీ ధనంజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!