Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkummar Rao: నటుడికి ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్.. ఏడేళ్ల క్రితమే డాక్టర్ చెప్పడంతో ఆ పనిచేశానంటూ..

బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు. తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఓ ఈవెంట్లో రాజ్ కుమార్ సందడి చేశారు. ఆ సమయంలో దిగిన ఫోటో నెట్టింట వైరలయ్యింది.

Rajkummar Rao: నటుడికి ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్.. ఏడేళ్ల క్రితమే డాక్టర్ చెప్పడంతో ఆ పనిచేశానంటూ..
Rajkumar Rao
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2024 | 9:08 PM

సినీ పరిశ్రమలో నటీనటుల రూపం పై చాలాసార్లు ట్రోల్స్ జరుగుతుంటాయి. ఎప్పుడైనా కాస్త కొత్తగా కనిపించినా.. లేదా మేకప్ లేకుండా కనిపిస్తే ప్లాస్టరీ సర్జరీ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఈ ట్రోల్స్ ఎక్కువగా హీరోయిన్స్ పై జరుగుతుంటాయి. కానీ ఇటీవల ఓ నటుడు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. తాజాగా తన రూపంపై వచ్చిన కామెంట్లపై రియాక్ట్ అయ్యారు సదరు నటుడు. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు. తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఓ ఈవెంట్లో రాజ్ కుమార్ సందడి చేశారు. ఆ సమయంలో దిగిన ఫోటో నెట్టింట వైరలయ్యింది. అందులో అతడి లుక్ మారడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడంటూ రూమర్స్ వినిపించాయి.

“సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ ఫోటో అస్సలు బాగలేదు. అది నాలా అనిపించదు. నిజానికి నాకు ఫోటో నచ్చలేదు. మేకప్ లేకపోవడం వల్ల అలా కనిపించింది. ఇక అదే ఫోటోను ఇప్పుడు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నా ఫోటోస్ షేర్ చేస్తూ ప్లాస్టిక్ సర్జరీ అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నారు. కానీ నేనెప్పుడు వాటి జోలికి వెళ్లలేదు. కానీ ఏడేళ్ల క్రితం నా ముఖం బ్యాలెన్స్ గా కనిపించేందుకు .. మరింత అందంగా కనిపించేందుకు మా పర్సనల్ డాక్టర్ చెప్పినట్లు ఫిల్లర్ ట్రై చేశాను” అని అన్నారు.

“ఆత్మవిశ్వాసం పెంచేందుకు అలా చేయడం తప్పేమి కాదు. దాని వల్ల మనకు నష్టమేమి లేదు కాదా.. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఖర్చుతో కూడిన వైధ్యం. ఎంతో సమయం పడుతుంది కూడా. నన్ను ట్రోల్స్ చేస్తుంటారు.. కొన్నిసార్లు ఆ కామెంట్స్ చూస్తే కామెడీగా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఫేక్ అని నాకు తెలుసు కదా.. నటీనటులు అందంగా కనిపించాలని ఎప్పుడూ ఏదోక ప్రయత్నం చేస్తుంటారు. దీంతో నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటారు” అని అన్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ రావు అంధుడు శ్రీకాంత్ బొల్ల బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ మే 10న రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!