Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం

తెలంగాణలో ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు కామ్రేడ్స్ సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగమైన సీపీఐ, సీపీఎం మద్దతు కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీంతో తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనేందుకు తాము కాంగ్రెస్‌్ె మద్దతు ఇస్తున్నామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి.

Lok Sabha Election: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం
Cpi, Cpm Support To Congress
Follow us
Sravan Kumar B

| Edited By: Balaraju Goud

Updated on: Apr 20, 2024 | 9:04 PM

తెలంగాణలో ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు కామ్రేడ్స్ సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగమైన సీపీఐ, సీపీఎం మద్దతు కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీంతో తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనేందుకు తాము కాంగ్రెస్‌్ె మద్దతు ఇస్తున్నామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి.

పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సీపీఎం నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఇక శనివారం సీపీఐ పార్టీ కార్యాలయంలో సీపీఐ ముఖ్య నేతలతోనూ చర్చలు జరిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేయాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. బీజేపీని తెలంగాణలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని సిపిఐ వెల్లడించింది. ఆ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మీడియా సమావేశంలో తెలిపారు.

సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తును, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని, నిర్ణయించే ఎన్నికలని ఇరు పార్టీల నేతలు తెలిపారు. మతోన్మాదంతో నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ భారత రాజ్యాంగానికి పెను సవాలు విసురుతున్నారని ఆరోపించారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు లౌకికవాద పార్టీలతో కలిసి ఇండియా కూటమి ఏర్పడినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరుల సూచనల మేరకే మద్దతు కోరినట్లు డిఫ్యూటీ సీఎం భట్టి చెప్పారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సహకారం, మద్దతు అందించాల్సిందిగా అభ్యర్థించానన్నారు.

తెలంగాణలో లౌకికవాదాన్ని కాపాడే క్రమంలోనూ, పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి, రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీని అడ్డుకునేందుకు కలిసి ప్రయాణించాలనే నిర్ణయానికి రావడం జరిగిందన్నారు భట్టి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ కలసి ముందుకు వెళ్ళాలని మూడు పార్టీలు నిర్ణయించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…