AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddhartha: నిఖిల్ కొడుకు పేరెంటో తెలుసా? తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో

ఇదిలా ఉంటే తాజాగా తన కుమారుడిని అందరికీ పరిచయం చేశాడు నిఖిల్. ఈ సందర్భంగా తనకు ధీర సిద్ధార్థ అని నామకరణం చేసినట్లు వెల్లడించాడు. అలాగే తండ్రయ్యాక కొన్ని అలవాట్లకు స్వస్తి చెప్పానన్నాడీ యంగ్ హీరో. 'మా అబ్బాయి పేరు ధీర సిద్దార్థ్. తండ్రి అయ్యాక కొన్ని అలవాట్లు పూర్తిగా మానుకున్నాను'...

Nikhil Siddhartha: నిఖిల్ కొడుకు పేరెంటో తెలుసా? తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో
Nikhil Siddhartha Family
Basha Shek
|

Updated on: Apr 19, 2024 | 9:56 PM

Share

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య పల్లవి ఈ ఏడాది ఫిబ్రవరిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిఖిల్- పల్లవి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే తాజాగా తన కుమారుడిని అందరికీ పరిచయం చేశాడు నిఖిల్. ఈ సందర్భంగా తనకు ధీర సిద్ధార్థ అని నామకరణం చేసినట్లు వెల్లడించాడు. అలాగే తండ్రయ్యాక కొన్ని అలవాట్లకు స్వస్తి చెప్పానన్నాడీ యంగ్ హీరో. ‘మా అబ్బాయి పేరు ధీర సిద్దార్థ్. తండ్రి అయ్యాక కొన్ని అలవాట్లు పూర్తిగా మానుకున్నాను. వీలైనంత వరకు ఎక్కువ సమయం కుటుంబం కోసం కేటాయిస్తున్నాను . తండ్రిగా బాబు బాధ్యతలను కూడా పంచుకుంటున్నాను. ఎక్కువ సమయం వాడితోనే గడపుతున్నాను. గతంలో వారంలో కనీసం ఒక్కసారి అయినా సరే నైట్ పార్టీకి వెళ్లేవాడిని. అయితే ఇప్పుడు ఆ అలవాటు పూర్తిగా మార్చుకున్నాను. పార్టీలకు వెళ్లడం మానేశాను. అమ్మానాన్నలు అయ్యాక పిల్లల కోసం కొన్నిటినీ వదులుకోవాల్సి వస్తుంది. పిల్లలు మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలని అర్ధం చేసుకున్నాను. ఇలా నాలో వచ్చిన మార్పు తో నేనెంతో సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు నిఖిల్.

ఇవి కూడా చదవండి

కాగా నిఖిల్, పల్లవి లది ప్రేమ వివాహం. 2020లో కరోనా లాక్ డౌన్ ఆంక్షల నడుమ అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్వయంభు అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు నిఖిల్. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంయుక్తా మేనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నభా నటేశ్ మరో కీలక పాత్రలో మెరవనుంది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం నిఖిల్ చాలా కష్టపడుతున్నాడు. గుర్రపు స్వారీ, యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి