- Telugu News Photo Gallery Cinema photos Will S. S. Rajamouli Follow New Strategy For Mahesh Babu Movie
Mahesh Babu: మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఆకాశానికి ఎక్కాలనుకున్నప్పుడు నిచ్చెనకూడా అక్కడికే వేయాలి కదా.. అలా కాకుండా నేల మీదే నడుస్తా.. ఆకాశానికి ఎక్కాలి.. అంటే కుదురుతుందా చెప్పండి... ఈ ఫార్ములాని చాలా బాగా అర్థం చేసుకున్నారు జక్కన్న. ఇంటర్నేషనల్ లెవల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి, ప్లానింగ్ కూడా అలాగే చేస్తున్నారు... ఈ విషయం తెలుసుకుని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. గుంటూరు కారంలో మహేష్ మాస్ అప్పీల్‌ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు జనాలు. దానికి తోడు ఫస్ట్ టెలికాస్ట్ టీఆర్‌పీ 9.23 రావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Apr 19, 2024 | 9:51 PM

ఆకాశానికి ఎక్కాలనుకున్నప్పుడు నిచ్చెనకూడా అక్కడికే వేయాలి కదా.. అలా కాకుండా నేల మీదే నడుస్తా.. ఆకాశానికి ఎక్కాలి.. అంటే కుదురుతుందా చెప్పండి... ఈ ఫార్ములాని చాలా బాగా అర్థం చేసుకున్నారు జక్కన్న. ఇంటర్నేషనల్ లెవల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి, ప్లానింగ్ కూడా అలాగే చేస్తున్నారు... ఈ విషయం తెలుసుకుని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు.

గుంటూరు కారంలో మహేష్ మాస్ అప్పీల్‌ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు జనాలు. దానికి తోడు ఫస్ట్ టెలికాస్ట్ టీఆర్‌పీ 9.23 రావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. మహేష్ స్టామినా అంటే ఇదీ అని సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

మహేష్ నెక్స్ట్ రాజమౌళితో సినిమా చేయడానికి మేకోవర్ అవుతున్నారు. ఈ మధ్య ఫారిన్ ట్రిప్ ఫొటోల్లో ఆ మేకోవర్ కనిపించకుండా లుక్‌ని హైడ్ చేసుకున్నారు. అయినా తమ అభిమాన హీరో సినిమా డీటైల్స్ కూపీ లాగుతూనే ఉన్నారు ఫ్యాన్స్. వాళ్ల ఆసక్తిని గమనించిన రాజమౌళి ఈ సారి థింక్ బిగ్ అంటూ ఊరిస్తున్నారు.

సినిమా రిలీజ్‌కి ముందు ప్రెస్‌మీట్ పెట్టి డీటైల్స్ రివీల్ చేయడం జక్కన్నకు అలవాటు. అయితే ఈ సారి అలా కాకుండా, ఓ వీడియోతో కాన్సెప్ట్ ని రివీల్ చేయాలనుకుంటున్నారట. ఇందులో ఆర్టిస్టులు ఉండరు. జస్ట్ థీమ్‌ని పరిచయం చేయడానికే ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్.

ఇంటర్నేషనల్ రేంజ్‌లో చేయబోయే ప్రాజెక్ట్ కాబట్టి, అక్కడి ట్రేడ్ వర్గాలను కూడా అట్రాక్ట్ చేయాలంటే, ఇలాంటి ట్రెండీ ట్రిక్స్ ని కంపల్సరీగా ఫాలో కావాలని అనుకుంటున్నారట జక్కన్న. ప్రభాస్, తారక్, చెర్రీ విషయంలో ఇంప్లిమెంట్ కాని వాటిని, చేయాలనుకుని చేయలేకపోయిన వాటిని... ఇప్పుడు మహేష్ సినిమా జర్నీలో ఆచరణలో పెట్టాలనుకుంటున్నారట రాజమౌళి. సో ఏదో ఒక అప్‌డేట్ అందుతూనే ఉంటుంది కాబట్టి, అభిమానులు బేఫికర్‌గా ఉండొచ్చన్నమాట.





























