Gold Price: బంగారం కొనే వారికి కాస్త రిలీఫ్‌.. ఆదివారం గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి బంగారం ధరలు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌ టైమ్‌ రికార్డు ధరకు చేరకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, యుద్ధ నేపథ్యం కారణం ఏదైనా బంగారం ధర జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. తులం బంగారం ఏకంగా రూ. 75 వేలకు చేరువలో ఉంది. శనివారం రోజు కూడా బంగరం ధరలో...

Gold Price: బంగారం కొనే వారికి కాస్త రిలీఫ్‌.. ఆదివారం గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..
Gold Price
Follow us

|

Updated on: Apr 21, 2024 | 6:33 AM

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి బంగారం ధరలు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌ టైమ్‌ రికార్డు ధరకు చేరకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, యుద్ధ నేపథ్యం కారణం ఏదైనా బంగారం ధర జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. తులం బంగారం ఏకంగా రూ. 75 వేలకు చేరువలో ఉంది. శనివారం రోజు కూడా బంగరం ధరలో పెరుగుద కనిపించింది. అయితే ఆదివారం గోల్డ్‌ లవర్స్‌కి కాస్త ఊరటనిచ్చే వార్త వినిపించింది. బంగారం ధరలో పెరుగుదల కనిపించలేదు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,210కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,390 వద్ద కొనసాగుతోంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,240 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,110 వద్ద కొనసాగుతోంది.

* కేరళలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,050 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,240 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,050గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,240 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,080కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 74,240గా ఉంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 68,080గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,240 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీతోపాటు, ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 86,500 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 90,000 పలుకుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..