IRDAI: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్.. ఆ విషయంతో సంబంధం లేదు

హెల్త్ ఇన్సూరెన్స్‌పై బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలుకు 65 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి తొలగిస్తూ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా బీమా తీసుకోవచ్చని తెలిపింది. ఈ విధానం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఐఆర్‌డీఏఐ పేర్కొంది..

IRDAI: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్.. ఆ విషయంతో సంబంధం లేదు
Health Insurance
Follow us

|

Updated on: Apr 20, 2024 | 9:13 PM

హెల్త్ ఇన్సూరెన్స్‌పై బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలుకు 65 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి తొలగిస్తూ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా బీమా తీసుకోవచ్చని తెలిపింది. ఈ విధానం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఐఆర్‌డీఏఐ పేర్కొంది. ముందుగా ఉన్న వ్యాధుల కోసం వెయిటింగ్ పీరియడ్ నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు, అలాగే మారటోరియం 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించినట్లు తెలిపింది. బీమా సంస్థలు అన్ని వయసుల వారికి ఆరోగ్య బీమా ఉత్పత్తులను అందజేస్తాయని నిర్ధారించుకోవాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. బీమా సంస్థలు సీనియర్ సిటిజన్‌లు, విద్యార్థులు, పిల్లలు, ప్రసూతి, కాంపిటెంట్ అథారిటీ ద్వారా నిర్దేశించిన ఏదైనా ఇతర గ్రూపుల కోసం ప్రత్యేకంగా ఉత్పత్తులను రూపొందించవచ్చని ఐఆర్‌డీఏఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశంలో మరింత సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, బీమా ప్రొవైడర్ కంపెనీలు తమ ఉత్పత్తులను అందించడానికి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఛానెల్‌:

ఐఆర్‌డీఏఐ ఆరోగ్య బీమా ప్రొవైడర్‌లను సీనియర్ సిటిజన్‌ల వంటి నిర్దిష్ట జనాభా కోసం రూపొందించిన పాలసీలను ప్రవేశపెట్టాలని, వారి క్లెయిమ్‌లు, ఫిర్యాదులను నిర్వహించడానికి ప్రత్యేక ఛానెల్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తీసుకున్న నిర్ణయం 65 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య రక్షణ కోసం తీసుకువచ్చిన ఈ విధానం స్వాగతించదగిన మార్పు. బీమాదారులు వారి బోర్డు ఆమోదించిన అండర్ రైటింగ్ మార్గదర్శకాల ఆధారంగా 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను కవర్ చేయవచ్చు. కవరేజ్ స్థోమత ఆధారంగా బీమా, బీమాదారు మధ్య అంగీకారానికి లోబడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవలి నోటిఫికేషన్ తర్వాత, క్యాన్సర్, గుండె లేదా మూత్రపిండ వైఫల్యం, ఎయిడ్స్‌ వంటి తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉన్న వ్యక్తులకు పాలసీలను జారీ చేయడానికి బీమా సంస్థలు నిరాకరించడం నిషేధించింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఐఆర్‌డీఏఐ ఆరోగ్య బీమా నిరీక్షణ వ్యవధిని 48 నెలల నుండి 36 నెలలకు తగ్గించింది. బీమా రెగ్యులేటర్ ప్రకారం, పాలసీదారు మొదట్లో వెల్లడించాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా ముందుగా ఉన్న అన్ని షరతులను 36 నెలల తర్వాత కవర్ చేయాలి. సులభంగా చెప్పాలంటే, ఈ 36 నెలల తర్వాత ఇప్పటికే ఉన్న పరిస్థితుల ఆధారంగా క్లెయిమ్‌లను తిరస్కరించడం నుండి ఆరోగ్య బీమా సంస్థలు నిషేధించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..