Best Airport: ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..? హైదరాబాద్‌ విమానాశ్రయం ఏ స్థానంలో ఉంది?

దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. సింగపూర్‌కు చెందిన ఛాంగి రెండో స్థానంలో ఉంది. కొన్నేళ్లుగా ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను ఈ రెండే పంచుకుంటుండడం విశేషం. స్కైట్రాక్స్‌ ఏటా విడుదల చేసే ఈ నివేదికలో గతేడాది ఛాంగి అగ్రభాగాన నిలిచింది. సియోల్‌ ఇన్చెయాన్‌ విమానాశ్రయం మూడో

Best Airport: ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..? హైదరాబాద్‌ విమానాశ్రయం ఏ స్థానంలో ఉంది?

|

Updated on: Apr 20, 2024 | 8:34 PM

దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. సింగపూర్‌కు చెందిన ఛాంగి రెండో స్థానంలో ఉంది. కొన్నేళ్లుగా ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను ఈ రెండే పంచుకుంటుండడం విశేషం. స్కైట్రాక్స్‌ ఏటా విడుదల చేసే ఈ నివేదికలో గతేడాది ఛాంగి అగ్రభాగాన నిలిచింది. సియోల్‌ ఇన్చెయాన్‌ విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. 2024లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టుగానూ ఇది అవార్డు సొంతం చేసుకుంది. టోక్యోలోని హనీదా, నరీతా వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. కొవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం అందుకు దోహదం చేసింది. అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయం కూడా తొలి 20 స్థానాల్లో లేకపోవడం గమనార్హం. సియాటెల్‌లోని టకోమా ఎయిర్‌పోర్టుకు దక్కిన 24వ ర్యాంకే ఆ దేశానికి అత్యుత్తమైనది. ఐరోపా ప్రాంతంలో ప్యారిస్‌ చార్లెస్‌ డి గలే, మ్యూనిచ్‌, జ్యూరిక్‌ టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి. అయితే ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టులు.. అలాగే హైదరాబాద్‌ విమానాశ్రయం ఏ స్థానంలో ఉంది..? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి.

Follow us