Fund For Education: మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?

Fund For Education: మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?

Subhash Goud

|

Updated on: Apr 20, 2024 | 8:03 PM

ఎడ్యుకేషన్ ఫండ్‌ను స్టార్ట్ చేసేటప్పుడు సమయపాలన చాలా ముఖ్యం. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. మీ డబ్బు కాంపౌండింగ్ ద్వారా వృద్ధి చెందడానికి అంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. చిన్న మొత్తాన్ని అయినా పెట్టుబడిగా పెట్టడం ప్రారంభిస్తే.. అది కొంతకాలానికి పెద్ద కార్పస్ గా మారుతుంది. పెట్టుబడి కోసం సరైన ఆప్షన్ ను ఎంచుకోవడం చాలా..

ఎడ్యుకేషన్ ఫండ్‌ను స్టార్ట్ చేసేటప్పుడు సమయపాలన చాలా ముఖ్యం. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. మీ డబ్బు కాంపౌండింగ్ ద్వారా వృద్ధి చెందడానికి అంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. చిన్న మొత్తాన్ని అయినా పెట్టుబడిగా పెట్టడం ప్రారంభిస్తే.. అది కొంతకాలానికి పెద్ద కార్పస్ గా మారుతుంది. పెట్టుబడి కోసం సరైన ఆప్షన్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే EPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) , కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన వంటి అనేక పెట్టుబడి ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి.

మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో 12 శాతం వరకు రాబడిని పొందవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి EPFపై వడ్డీ 8.25 శాతం. PPFలో సంవత్సరానికి 7.1 శాతం. బ్యాంక్ FDలో 7 నుండి 8 శాతం, సుకన్య సమృద్ధి యోజన 8.2 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది. మీరు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని ఇచ్చే
పెట్టుబడి ఆప్షన్ ను ఎంచుకోవాలి.