AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manjummel Boys OTT: అఫీషియల్.. ‘ముంజుమెల్ బాయ్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రీసెంట్ గా రిలీజైన మంజుమ్మెల్ బాయ్స్ అయితే మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. ఏకంగా రూ. 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఘనత సాధించిన మొదటి మలయాళ మూవీగా రికార్డుల కెక్కింది. తెలుగులోనూ మంజుమ్మెల్ బాయ్స్ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Manjummel Boys OTT: అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Manjummel Boys Movie
Basha Shek
|

Updated on: Apr 19, 2024 | 8:39 PM

Share

ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో మలయాళ మూవీస్ దే హవా. కేవలం మలయాళంలోనే తెలుగు, తమిళ్, కన్నడ వంటి దక్షిణాది భాషల్లోనూ మాలీవుడ్  చిత్రాలు సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే ప్రేమ‌లు’, ‘భ్ర‌మ‌యుగం’ వంటి మలయాళ సినిమాలు తెలుగులోనూ భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఇక రీసెంట్ గా రిలీజైన మంజుమ్మెల్ బాయ్స్ అయితే మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. ఏకంగా రూ. 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఘనత సాధించిన మొదటి మలయాళ మూవీగా రికార్డుల కెక్కింది. తెలుగులోనూ మంజుమ్మెల్ బాయ్స్ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు మరికొన్ని రోజుల్లో తెరపడనుంది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోన్న మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 3 నుంచి మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

చిదంబర్ పీ పొదువల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో శోభున్ షాహిర్ తో పాటు, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్, అభిరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. యదార్థ సంఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెరకెక్కింది. కోడైకెనాల్ లోని ఒక ప్రమాదకరమైన గుహను చూడటానికి కేరళ నుండి స్నేహితుల బృందం విహార యాత్ర కు వెళతుంది. అయితే స్నేహితుల్లో ఒకరు ప్రమాదవశాత్తూ గుహలో పడిపోతారు. మరి ఆ యువకుడిని ఆ బృందం ఎలా కాపాడుకుంది? వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నదే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా.

ఇవి కూడా చదవండి

మే 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

స్టార్ హీరోల ప్రశంసలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి