Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటక్కా ఇలా తయారయ్యారు.. భార్య ఖాతాలో మరో భర్త బలి.. ప్రియుడితో కలిసి శ్రీశైలం వెళ్లి..

ప్రియుడితో కలిసి 17ఏళ్ల పెళ్లి బంధానికి చరమగీతం పాడింది ఓ వివాహిత. కిరాతకంగా భర్తను హత్య చేసి ఏమి ఎరగనట్టు నటించింది. ఇక తన అన్న అదృశ్యమయ్యాడంటూ సొదరి ఇచ్చిన ఫిర్యాదుతో.. భార్య బాగోతంతోపాటు.. హత్య కేసు డొంక కదులుతోంది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని వనపర్తి జల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

ఏంటక్కా ఇలా తయారయ్యారు.. భార్య ఖాతాలో మరో భర్త బలి.. ప్రియుడితో కలిసి శ్రీశైలం వెళ్లి..
Affair
Boorugu Shiva Kumar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 01, 2025 | 8:59 PM

Share

ప్రియుడితో కలిసి 17ఏళ్ల పెళ్లి బంధానికి చరమగీతం పాడింది ఓ వివాహిత. కిరాతకంగా భర్తను హత్య చేసి ఏమి ఎరగనట్టు నటించింది. ఇక తన అన్న అదృశ్యమయ్యాడంటూ సొదరి ఇచ్చిన ఫిర్యాదుతో.. భార్య బాగోతంతోపాటు.. హత్య కేసు డొంక కదులుతోంది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని వనపర్తి జల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తనే కర్కశంగా ప్రియుడితో కలిసి హత్య చేసింది భార్య. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా డెడ్ బాడీని శ్రీశైలం డ్యాంలో పడేశారు.

వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కేంద్రంలోని గణేశ్ నగర్ కాలనీకి చెందిన కురుమూర్తి భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఓ మాల్ లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇదే కాలనీకి చెందిన బైక్ మెకానిక్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ తో నాగమణి కి శారీరక సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త కురుమూర్తి తెలియడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత నెల 25వ తేదీన వివాహేతర సంబంధం అంశంపై భర్త కురుమూర్తి, భార్య నాగమణి, ఆమె ప్రియుడు శ్రీకాంత్ మధ్య గొడవ జరిగింది. ఇదే అదునుగా భావించి భార్య నాగమణి, ప్రియుడు శ్రీకాంత్ ఇద్దరు భర్త కురుమూర్తిపై దాడి చేశారు. అనంతరం దిండును ముఖంపై నొక్కిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాత ఎవరికి అనుమానం రాకుండా సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తీసుకొని కురుమూర్తి శవాన్ని శ్రీశైలం డ్యాంలో పడేశారు.

మిస్సింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి హత్య:

ఇక 25వ తేది నుంచి తన అన్న కనబడకపోవడంతో కురుమూర్తి సోదరి చెన్నమ్మ వదిన నాగమణిని ఆరా తీసింది. 25వ తేదిన గొడవ జరగిందని ఆ తర్వాత పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటికి రాలేదని తెలిపింది. దీంతో సోదరి చెన్నమ్మ వనపర్తి టౌన్ పీఎస్ లో సోదరుడు కురుమూర్తి మిస్సయినట్లు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భార్యను అదుపులోకి తీసుకొని గొడవ ఎందుకు జరిగిందన్న కోణంలో ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది.

శ్రీశైలం రిజర్వాయర్ లో భర్త మృతదేహం డంప్..

దీంతో భార్య నాగమణి, ఆమె ప్రియుడు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఇక హత్య ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. డెడ్ బాడీ శ్రీశైలం రిజర్వాయర్ లో పడేయడంతో అక్కడికి రెండు దర్యాప్తు బృందాలు వెళ్లి గాలిస్తున్నాయి. ఇక హత్య ఘటన ఓ కొలిక్కి రాగానే నిందితులిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..