రక్తదానం చేసిన వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన ఛాయ్‌వాలా..!
రక్తదానం చేయండి.. ఫ్రీగా టీ తాగండి..! ఇదేంటి రక్తదానం చేసిన వారికి ఎక్కడైనా పండ్లు అందిస్తారు. ఇక్కడ ఏంటీ టీ ఇస్తున్నారని అనుకుంటున్నారా..? ఓ టీ స్టాల్ నిర్వాహకుడు రక్తదానమును ప్రోత్సహించాలనే ఆలోచనతో ఇలా చేస్తున్నాడు. రక్తదానం చేయండి.. ఫ్రీగా టీ తాగండి అంటూ అతడు చేసిన పోస్టు సామాజిక మధ్యమాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది.

రక్తదానం చేయండి.. ఫ్రీగా టీ తాగండి..! ఇదేంటి రక్తదానం చేసిన వారికి ఎక్కడైనా పండ్లు అందిస్తారు. ఇక్కడ ఏంటీ టీ ఇస్తున్నారని అనుకుంటున్నారా..? ఓ టీ స్టాల్ నిర్వాహకుడు రక్తదానమును ప్రోత్సహించాలనే ఆలోచనతో ఇలా చేస్తున్నాడు. రక్తదానం చేయండి.. ఫ్రీగా టీ తాగండి అంటూ అతడు చేసిన పోస్టు సామాజిక మధ్యమాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. అతని సామాజిక స్పృహాను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
ఇది ఎక్కడ అంటారా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో.పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్‌లో పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయటానికి పలు ప్రచార మాధ్యమాలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నేలకొండపల్లిలోని తార కేఫ్ (టీ స్టాల్ ) నిర్వాహకుడు తన వంతు బాధ్యతగా రక్తదాన శిబిరం విజయవంతం చేయటానికి రక్తదానం చేసిన వారికి ఫ్రీగా టీ అందిస్తానని తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది.

Chaiwala Bumper Offer
ఈ పోస్టును సామాజిక మాధ్యమంలో చూసినవారు అసక్తిగా చదువుకున్నారు. తాను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విధంగానే అందరికీ ఉచితంగా ఛాయ్ అందించాడు. మెగా రక్తదాన శిబిరానికి సైతం భారీగా స్పందన లభించింది. రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా టీ అందించిన టీ స్టాల్ యజమాని పలువురు అభినందించారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
